Auto driver ‘assaults’ actress’s father బాలీవుడ్ నటి తండ్రిపై అటో డ్రైవర్ దాడి..

Sumona chakravarti s father assaulted by autorickshaw driver

Sujeet Chakravarti, Seven Hills Hospital, Powai police station, Motor Vehicle Act, Autorickshaw driver, Amit Gupta, Andheri (East), Actress Sumona Chakravarti, mumbai police, maharastra, crime

Actress Sumona Chakravarti's father was allegedly recently assaulted by an autorickshaw driver on a busy road. A bleeding Sujeet Chakravarti, 56, was taken to hospital by the actress's mother.

బాలీవుడ్ నటి తండ్రిపై అటో డ్రైవర్ దాడి..

Posted: 10/17/2017 12:01 PM IST
Sumona chakravarti s father assaulted by autorickshaw driver

బాలీవుడ్ నటి తండ్రికి ఘోర పరాభవం జరిగింది. ఆయనపై ఓ అటోడ్రైవర్ విఛక్షణ కోల్పోయి దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలీవుడ్ నటి సుమోన చక్రవర్తి తండ్రి సుజీత్ చక్రవర్తిపై దేశ అర్థిక రాజధాని ముంబైలో ఓ ఆటో డ్రైవర్‌ దాడి చేశాడు. ఈ ఘటన ఈ నెల తొలివారంలోనే జరగుగా అలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై నటి సుమోన చక్రవర్తి ఔను.. నిజమే మా నాన్నగారిపై ఓ అటో డ్రైవర్ దాడి చేశారని అంగీకరించింది.

బాల నటిగా కెరీర్‌ను ఆరంభించిన సుమోన.. కపిల్‌ శర్మ షోతోపాటు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలతో బిజీగా వున్నారు. కాగా తన తండ్రిపై అటోడ్రైవర్ జరిపిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుపుతూ.. అంధేరీ సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి సమీపంలో తమ కుటుంబం నివాసం ఉంటుందని.. అయితే తన తల్లికి అనారోగ్యంగా వున్న క్రమంలో ఆమెను అసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆటోను మాట్లాడుకునేందుకు రోడ్డు మీదకు రాగా.. ఒక ఆటో డ్రైవర్ ఎక్కువ డబ్బును  డిమాండ్ చేశాడు. అతనితో సుజిత్ వాదనకు దిగారు.

ఈ క్రమంలో ఆ సుజిత్ అడిగిన ప్రశ్నలకు బదులుచెప్పలేక కోపంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్ నటి తండ్రిని అక్కడే వున్న ఓ బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. అది గమనించిన సుమోన తల్లి.. గాయపడిన సుజిత్ ను స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పొవాయి పోలీసులు దృవీకరించారు కూడా. సుమోన, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా, ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆటో డ్రైవర్‌ అమిత్‌ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles