thief robbed rtc bus in kurnool, injuring police man పోలీసును ఢీకొట్టి అర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు..

Thief robbed rtc bus in kurnool injuring police man

rtc bus theft, rtc bus robbery, thief, thieves, rtc, apsrtc, apsrtc bus, bus robbedy, rtc bus, kurnool, crime news, breaking news, latest news

In a bizzare incident a thief robbed rtc bus from kurnool of andhra pradesh, injuring police head consitable

పోలీసును ఢీకొట్టి అర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి..

Posted: 10/07/2017 12:36 PM IST
Thief robbed rtc bus in kurnool injuring police man

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నందికొట్కూరులో సినిమాఫక్కీలో దొంగ పోలిస్ చేజింగ్ సాగింది. దాదాపుగా పది కిలోమీటర్ల మేర ఓ ఆర్టీసీ బస్సును వెంబడించిన పోలీసులు చేజింగ్ చేసిన దానిని నడుపుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు బస్సులను చౌర్యం చేసే ఓ దొంగ దృష్టి అర్టీసీ బస్సుపై పడింది. దానిని దొంగలించేందుకు అప్పటికప్పుడు పథక రచన చేసి బస్సును ఎత్తుకెళ్లాడు. అడ్డువచ్చిన ఓ కానిస్టేబుల్ ను బస్సుతో ఢీకొట్టి మరీ ఎతుకెళ్లాడు.

వివరాల్లోకి వెళ్తే.. నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండులో బస్సును నిలిమిన డ్రైవర్ టీ తాగేందుకు వెళ్లడాన్ని గమనించిన శ్రీనివాస్ అనే దొంగ బస్సు చోరీకి యత్నించాడు. విషయాన్ని గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సును పట్టుకోవడానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణను.. దొంగ బస్సుతో ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాల పాలు కావడంతో స్థానికంగా గల అస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అతని వాహనం కూడా పూర్తిగా ధ్వంసమయ్యింది.

ఇక అటు ఢిపో అదికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు బస్సును సుమారు పది కిలోమీటర్లు మేర వెంబడించారు. చివరకు తాను దొరికిపోక తప్పదని గ్రహించిన దోంగ బల్లవరం వద్ద దిక్కుతోచని పరిస్థితుల్లో అందోళనకు గురవుతుండగానే.. పోలీసులు బస్సును చేజ్ చేసి బస్సును స్వాధీనపర్చుకున్నారు. దొంగ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rtc bus theft  rtc bus robbery  thief  thieves  rtc  apsrtc  apsrtc bus  bus robbedy  rtc bus  kurnool  crime  

Other Articles