KYC not needed for buying jewellery above Rs 50000 కొనుగోలుదారులకు కేంద్రం ‘బంగారం’ లాంటి న్యూస్

Now no pan card required for jewellery purchase of over rs 50000

Aadhaar, Demonetisation, Gems and Jewellery, gold jewellery, GST, GST Council, jewellery purchase, note ban, PAN card, PMLA

Government suspended GST notification on gems and jewellery stating that PAN card will no longer be mandatory on the purchase of jewellery for over Rs 50,000.

కొనుగోలుదారులకు కేంద్రం ‘బంగారం’ లాంటి న్యూస్

Posted: 10/07/2017 01:38 PM IST
Now no pan card required for jewellery purchase of over rs 50000

బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు, విక్రేతలకు స్వర్ణంలాంటి వార్తను అందించింది కేంద్ర ప్రభుత్వం. నోట్ల రద్దు నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో ఆ తరువాత క్రమంలో బంగారం కోనుగోళ్లపై అంక్షలను విధించింది కేంద్రం. ఎవరైనా రూ.50,000కు మించి విలువైన బంగారం, వజ్ర, వెండి తదితర విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తే వారి పాన్‌ నంబర్ వివరాలు తెలియజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బంగారు, రత్నాభరణాల విక్రయాలను తీసుకువచ్చిన కేంద్రం.. తాజాగా గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వెళ్తున్న వేళ ఆ నిబంధనతో ఓటర్లు తమపై అసంతృప్తి వ్యక్తం చేస్తారని తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఈ మేరకు కీలక నిర్ణయాలను తీసుకుంది. రూ. 50వేల కన్నా అధికంగా కొనుగోలు చేసిన అభరాణాలు కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలు, పాన్ కార్డు ఇకపై అవసరం లేదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను కేంద్రం రద్దు చేసింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనానికి ఆభరణాల పరిశ్రమ చోటు కల్పిస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఖరీదైన లోహాలు, విలువైన రాళ్ల వ్యాపారులు, ఇతర అధిక విలువ కలిగిన ఉత్పత్తుల్లో వ్యాపారం నిర్వహించేవారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కిందకు తెస్తూ కేంద్రం గత ఆగస్ట్ లో నోటిఫికేషన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పరిశ్రమ నుంచి వచ్చిన వినతుల మేరకు ఎన్నో అంశాలను పరిశీలించిన అనంతరం నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ రంగానికి చెందిన భాగస్వాములతో సంప్రదించిన తర్వాత ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles