JC Diwakar Reddy to resign as MP ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి

Jc diwakar reddy to resign as anantapur member of parliament

i'm failed mp, jc diwakar reddy failed MP, JC Diwakar Reddy chagallu water scarcity, jc diwakar reddy tadipatri road widening, JC Diwakar Reddym Failed MP, Lok Sabha MP, Anantapur MP, Chagallu, water problem, Tadipatri, Anantapur, TDP, chandrababu, Politics

Telugu Desham Leader JC Diwakar Reddy made a sensational proclamation that he is resigning to his post as Member of Parliament. He said he will continue in TDP and will not stop working with Chandrababu Naidu.

ఎంపీగా నేను ఫెయిలయ్యా, రాజీనామా చేస్తా: జేసీ దివాకర్ రెడ్డి

Posted: 09/21/2017 02:01 PM IST
Jc diwakar reddy to resign as anantapur member of parliament

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించి వ్యాఖ్యలు ఇవాళ మీడియాతో పంచుకుని సంచలనాన్ని రేపారు. అనంతపురం ఎంపీగా తాను ఫెయిల్ అయ్యానని అని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన మనసాక్షి తనకు చెబుతుందని.. తన మనసాక్షి మేరకే తాను నడుచుకుంటున్నానని అందుచేత తాను తన ఎంపీ పదవికి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన నలబై ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారి తన మనసాక్షి తనను ఫెయిల్యూర్ ఎంపీ అని చెప్పిందని ఆయన అవేదనాభరితంగా చెప్పారు.

అయనేం అన్నారంటే.. నేను త్వరలో నా పదవికి రాజీనామా చేస్తాను. సోమ, మంగళవారాల్లో ఢిల్లీకి వెళ్లి.. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తన రాజీనామాను అందజేస్తానని అన్నారు. నేను ఎంపీగా ఫెయిల్ అయ్యా.. అది నా మనసాక్షి నాకు చెబుతుంది. నన్న నమ్ముకన్న ప్రజలకు నేనేమీ చేయలేదని నా మనసాక్షి పదే పదే నాకు చెబుతుంది. చాగల్లుకు నీళ్లు తేలేని నాకు ఎంపీ పదవి ఎందుకు..? అని ప్రశ్నించారు. తాడిపత్రికి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్డను విస్తరించలేకపోయానని అన్నారు. ప్రజాహితం కోసం చేయాల్సిన పనులు చేయలేకపోయిన నాకు ఈ పదవి వుండి లాభం ఏంటని ప్రశ్నించుకున్నట్లు చెప్పారు.

ఇంకా ఎమ్మాన్నారంటే తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎంపీని కాలేదని, ప్రజల మద్దతుతోనే తాను గతంలో గెలిచాను.. ఈ సారి కూడా విజయాన్ని అందుకున్నానన్నారు. ప్రజలు తనపై అభిమానం చూపేది ప్రజలకు అందునా అక్కడున్న సమస్యలను పరిశీలించి.. అధిక మందికి లబ్దిచేకూర్చే పనులను మాత్రం చేసేవాడినని చెప్పారు. అందుకే ప్రజలకు తనను అదరిస్తున్నారని, ఈ స్థాయిలో నిలిపారు. విలువలేనప్పుడు తనలాంటివాళ్లు రాజకీయాల్లో వుండటం వృధా అని వ్యాఖ్యానించిన ఆయన తాను రాజీనామా చేస్తున్నది కేవలం ఎంపీ పదవికి మాత్రమేనన్నారు. అయితే పార్టీలో కొనసాగుతానని, చంద్రబాబు వెంటే నడుస్తానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles