Terror attack in Tral, Kashmir జమ్మూకాశ్మీర్ లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు

3 dead in grenade attack state minister naeem akhtar convoy ambushed

tral attack, pulwama attack, kashmir attack, jammu and kashmir attack, naeem akhtar

Militants hurled a grenade at a senior Jammu and Kashmir minister's cavalcade in Tral today, killing two civilians and injuring six people, including two policemen, police said.

జమ్మూకాశ్మీర్ లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. గ్రనైట్ దాడి, కాల్పలు

Posted: 09/21/2017 01:19 PM IST
3 dead in grenade attack state minister naeem akhtar convoy ambushed

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అక్రమంగా దేశంలోకి చొచ్చుకోచ్చిన ముష్కరులు గ్రనైడ్ దాడికి పాల్పడి.. అ వెనువెంటనే తమ చేతిలోని తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ముగ్గురు పౌరుల ప్రాణాలను బలిగొన్నారు. జమ్మూకాశ్మీర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి నయీమ్ అక్తర్ లక్ష్యంగా గ్రనైడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా, మంత్రి మాత్రం తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. తీవ్రవాదులు అకస్మాత్తుగా జరిపిన దాడి, కాల్పులతో ట్రాల్ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది.

ముష్కరమూక కాల్పుల నేపథ్యంలో భయాందోళనకు గురైన కాశ్మీరులు అరుపులు కేకలతో తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా ట్రాల్ బస్టాండ్ సమీఫంలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.45 నిమిషాలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నయీం అక్తర్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. సరిగ్గా మంత్రి వస్తున్నారన్న సమయంలో అయన కారును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి.

ట్రాల్ ప్రాంతంలోని బస్టాండు సమీపంలో మంత్రి కార్యక్రమానికి హాజరవుతున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు కారుపై గ్రనైడ్ దాడికి పాల్పడ్డారు. అయితే అ దాడి నుంచి మంత్రి అక్తర్ తృటిలో తప్పించుకున్నారు. కాగా వెనువెంటనే తుపాకులతో కాల్పులకు తెగబడిన ముష్కరులు ముగ్గురు పౌరుల ప్రాణాలను బలితీసుకన్నారు. ఈ ఉగ్రవాదుల దాడిలో మరో ముపై మంది క్షత్రగాత్రులయ్యారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు.

ఉదయం దేశంలోకి అక్రమంగా చోచ్చుకువచ్చిన ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అయితే అంతకన్నా ముందుగానే మరో మూక అక్రమంగా దేశంలోకి చోచ్చుకుని వచ్చి. ఈ దాడులకు తెగబడిందా..? అన్న కోణంలో విచారణ సాగిస్తున్న బృందాలు.. దాడులు జరిపిన ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. ఈ దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tral attack  pulwama attack  kashmir attack  jammu and kashmir attack  naeem akhtar  

Other Articles