RBI may issue all-new Rs 1000 note by December రాను రానంటూనే.. డిసెంబర్ నాటకి వచ్చేయనుందా..?

Reserve bank of india may issue all new rs 1000 note by december

New Rs 1000 note, new rs 1000 note, remonetisation, currency notes, Reserve Bank of India (RBI), Sanchi Stupa, UNESCO, Rs 1000, Rs 1000 new note, Rs 200 note, demonetisation, Arun Jaitley, Urjit Patel, Rs 50 notes, New Notes

The Rs 1,000-denominated currency note, which was demonetized on November 8 last year, is coming back in a new avatar with enhanced security features.

రాను రానంటూనే.. డిసెంబర్ నాటకి వచ్చేయనుందా..?

Posted: 08/28/2017 06:14 PM IST
Reserve bank of india may issue all new rs 1000 note by december

పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. నిజానికి మార్పిడి మాత్రమే చేసిందని విమర్శలు తారస్థాయిలో వినబడుతున్నా.. పట్టించుకోకుండా మరో కొత్త నోటును ప్రజల అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటి రూ. 200 మాదిరిగానే మరో కొత్త నోటును చెలమణిలోకి తీసుకురానున్నారా..? అన్న సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఏళ్లుగా వినియోగంలో వున్న కరెన్సీనోటు(రూ.500 తరహాలో) నే మళ్లీ కోత్త డిజైన్ తో సరికోత్తగా ముద్రించి.. చెలామణిలోకి తీసుకువచ్చేందుకు రమారమి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.  

అసలింతకీ ఈ నోటు డినామినేషన్ ఎంత అంటారా..? వెయ్యి రూపాయలు. ఔనండీ మీరు విన్నది నిజమే. డిమానిటేజైషన్ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు చూచాయగా ఇదే విషయాన్ని చెప్పినా.. దానిని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మాత్రం తోసిపుచ్చారు. వెయ్యి రూపాయల నోటును మళ్లీ చెలామణిలోకి తీసుకువస్తారన్న వార్తలు సత్యదూరమని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి.

ప్రభుత్వ కరెన్సీ ప్రిటింగ్ ప్రెస్ లలో ఇప్పటికే అన్ని అనుమతులు పోందిన రూ.  వెయ్యి నోట్ల ముద్రణ శరవేగంగా జరుగుతుందని ఈ ఏడాది చివరినాటికి వీటిని చెలామణిలోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా మెండుగా వున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వంద, ఐదోందల నోట్ల మధ్య చిల్లర వ్యత్యాసాన్ని రూ.200 నోటుతో తీర్చేందుకు కొత్తగా వాటిని చెలమాణిలోకి తీసుకువచ్చిన కేంద్రం.. అదే విధంగా రూ.500లకు రూ.2000లకు మధ్య వున్న చిల్లర సమస్యను కూడా తీర్చడానికి రూ.1000 నోటును చెలామణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఈ మేరకు అర్బీఐలో వెయ్యి రూపాయల నోటు ముద్రణలో పాలుపంచుకుంటున్న ఓ అధికారి తమతో విశ్వసనీయంగా చెప్పారని జాతీయ మీడియా తన కథనంలో పేర్కోంది. మెరుగైన భద్రతా లక్షణాలు, కొత్త డిజైన్ తో రూ.1000 కరెన్సీ నోట్లను లాంచ్ చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మైసూర్, సల్బోనిలో ప్రింటింగ్ ప్రెస్ ప్రింటర్లు కొత్తగా రూ.1,000 నోట్లను ముద్రించటానికి సిద్ధంగా ఉన్నారట. డిసెంబరు 2017 నాటికి  ఇవి అందుబాటులోకి రానున్నాయని నివేదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Sanchi Stupa  Rs 1000 new note  Rs 200 note  demonetisation  Arun Jaitley  Urjit Patel  New Notes  

Other Articles