Former cricketer detained for reckless driving మాజీ క్రికెటర్ పై కేసు.. మద్యం మత్తే కారణమా..

Former cricketer haladhar das detained for reckless driving

Social Media, Cuttack, Haladhar Das, Odisha, Odisha Ranji team, inebriated condition, Mangalabag square, Chahataghat, reckless driving, cricket

Former Odisha Ranji team captain Haladhar Das was detained by the police here today for reckless driving causing series of accidents in the city.practice among the Muslims.

కారుతో వాహనాలను ఢికొట్టిన మాజీ క్రికెటర్ పై కేసు..

Posted: 08/28/2017 05:04 PM IST
Former cricketer haladhar das detained for reckless driving

అతివేగం అనర్థాలకు కారణమని పోలీసులు.. ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా వినకుండా వాహనాలను వేగంగా నడపటం ఫ్యాషన్ అన్నట్లుగా నడుపుతున్న యువత అనేక ప్రమాదాలకు కారణభూతం అవుతుంది. తాజాగా ఈ జాబితాలోకి వచ్చి చేరాడు మాజీ క్రికెటర్. తన కారును అతివేగంగా నడిపించడమే కాకుండా వరుగా వెళ్తున్న వాహనాలను ఢీకోడుతూ.. పెను దుమారం రేపాడు. దీంతో కంగారుపడిన వాహనదారులు ఆయనను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ మాజీ క్రికెటర్ వరుస ప్రమాదాలకు మద్యం సేవించడమే కారణమని పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. రద్దీ రోడ్డులో మద్యం మత్తులో మునిగిన.. వాహనంపై నియంత్రణ కోల్పోయిన క్రికెటర్ తన కారు నిర్లక్ష్యంగా నడిపి పలు వాహనాలను ఢీకొట్టాడు. వాహనం వరుసగా ముందున్న వాహనాలను ఢీకొనడంతో.. అగ్రహించిన స్థానికులు వాహనం నడిపి వ్యక్తిని పట్టుకుని నిలదీశారు. కారులో వున్నది మాజీ క్రికెటర్ అని గుర్తించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే క్రికెటర్ ఆ క్రికెటర్ ఎవరని అలోచిస్తున్నారా..? ఒడిశా రంజీ జట్టు మాజీ కెప్టెన్ గా వ్యవహరించిన హలధర్ దాస్.

క్రితం రోజు సాయంత్రం కటక్‌లో మంగళభాగ్ స్కేర్ నుంచి బైపాస్ రోడ్డులోని ఛాహతాఘాట్ వస్తుండగా, ఛాహతాఘాట్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రికెటర్ వరుసగా వాహనాలను ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పలువురుకి స్వల్ప దెబ్బలు తగిలాయి. దీంతో మాజీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బిదనాసి  పోలీసులు హలధర్ దాస్ ను విచారించారు. ఈయన ఒడిశా రంజీ టీంకు 2006 నుంచి 2009 వరకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Social Media  Cuttack  Haladhar Das  Odisha  Odisha Ranji team  reckless driving  cricket  

Other Articles