Reliance Jio suspends pre-booking for JioPhone రిలయన్స్ జియో ఫోన్ అభిమానులకు చేదువార్త...

Reliance jio temporarily stops pre booking for jiophone

Jio, Jio Phone, Reliance jio, jio featured phone, reliance jio featured phone, Jio Phone Booking, Jio Phone pre booking, reliance jio phone pre booking halt, jio phone booking halt, Reliance Jio, JioPhone prebookings, JioPhone prebookings suspended, register JioPhone interest, how to check JioPhone status, JioPhone booking status

Reliance Jio today announced that the company is temporarily halting the pre-booking for JioPhone.

రిలయన్స్ జియో ఫోన్ అభిమానులకు చేదువార్త...

Posted: 08/26/2017 01:19 PM IST
Reliance jio temporarily stops pre booking for jiophone

దేశ టెలికాం రంగంలోనే పెను సంచలనాలతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. ఇప్పటికే దేశంలో అతిపెద్ద నెట్ వర్క్ గా అవతరించే స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. ఆ సంస్థ ప్రకటించిన ఫీచర్ ఫోన్ విషయంలో కూడా దేశంలోని కస్టమర్ల నుంచి అదేస్థాయిలో ప్రజాదరణ లభించిందట. ఆ రెస్పాన్స్ చూసి షాకైన జియో సంస్థ ఏకంగా సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ నిర్ణయం వెలువడగానే జియో ఫోన్ అభిమానులు నిరాశకు గురయ్యారంటే నమ్మండి. ఇంతకీ ఏంటా నిర్ణయం అనేగా...

జియో ఫిచర్ ఫోన్ బుక్కింగ్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో.. బుకింగ్ ను ప్రారంభించిన 36 గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫీచర్డ్ పోన్ ఫ్రీగానే ఇస్తున్నాం అయితే ధరావత్తుగా రూ.1500 తీసుకుని మళ్లి వాటిని మూడేళ్లలో తిరిగి ఇచ్చేస్తాం అన్న జియో ప్రకటన ఫలితంలో ఏమోగాని.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వినియోగదారులు.. ఈ ఫోన్ల బుకింగ్ కు ఎగబడటంతో.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నిమిషానికే జియో సైట్ క్రాష్ అయ్యింది. అ తరువాత సవ్యంగా సాగింది. అయితే సంస్థ యాజమాన్య నిర్ణయం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ దెబ్బతో దబ్బకు దిగివచ్చిన రిలయన్స్.. జియో ఫీచర్డ్ ఫోన్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సవ్యంగా సాగినా.. ఫలితం లేకపోయింది. దీంతో జియో ఫీచర్డ్ ఫోన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురికాగా, జియో యాజమాన్యం మాత్రం.. మీ స్పందనకు ధన్యవాదాలు.. మళ్లీ ఎప్పుడు బుకింగ్ ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని సమాచారం పోర్టల్ లో సమాధానపర్చిందట.

జియో 4జి ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కాగానే సైట్ క్రాష్ అయ్యింది. సంస్థ సాంకేతిక నిపుణులు మరమ్మతు పనులు చేపట్టి సైట్ ను వినియోగగంలోకి తీసుకువచ్చారు. ఆ తరువాత సైట్ లో రిజిస్ట్రేషన్లు సవ్యంగానే సాగాయి. అయితే నిదానంగా బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఎందకంటే సంస్థ యాజమాన్యం బుకింగ్ ను క్లోజ్ చేసింది. కేవలం 36 గంటల మాత్రమే రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చిన యాజమాన్యం.. ఎంత మంది బుకింగ్ చేసుకున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.

కాగా, జియో ధన్యవాదాల మెసేజ్ ఆధారంగా చూస్తే కోటి ఫోన్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. బుకింగ్ ప్రారంభం అయిన 12 గంటల్లోనే 30 లక్షల మంది ఫోన్‌ను బుక్ చేసున్నారు. ఈ లెక్కను ఆధారం చేసుకుంటే కోటి మంది ఈజీగా ఉంటారని చెబుతున్నారు. ఆన్‌లైన్ సేల్స్‌లోనే జియో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ బుకింగ్స్‌ను నిలిపివేశారు. వెబ్ సైట్ లో థాంక్యూ ఇండియా అంటూ మెసేజ్ దర్శనం ఇస్తోంది. త్వరలోనే మరోసారి బుకింగ్స్ ను ప్రారంభిస్తామని జియో యాజమాన్యం తెలిపింది జియో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  JioPhone  pre bookings  suspended  register  online  website  

Other Articles