special treatment to the Dera chief In Rohtak Jail గుర్మీత్ సింగ్ కు రోహ్ తక్ జైలులో రాచమర్యాదలు..

After sasikala special treatment to the dera chief in rohtak jail

Ram Rahim, Gurmeet Ram Rahim Singh, Rohtak, Jail, Prison, VIP, Guesthouse, Rape, Rape convict, Panchkula, Violence, Dera Sacha Sauda, Tamil Nadu, BJP, PM Modi, SasiKala, Politics

After being convicted and arrested, the Dera chief was taken to Rohtak by helicopter. Video from the court premises showed a woman carrying out several bags and pieces of luggage as he left.

గుర్మీత్ సింగ్ కు రోహ్ తక్ జైలులో రాచమర్యాదలు..

Posted: 08/26/2017 11:45 AM IST
After sasikala special treatment to the dera chief in rohtak jail

అద్యాత్మిక గురువు ముసుగులో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం జరిపారన్న అభియోగాలు నిర్థారణ కావడంతో.. దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను హరియాణాలోని రోహ్ తక్ జైలుకు తరలించడం.. ఈ నేపథ్యంలో ఆయన శిష్యులు దేశరాజధాని ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో విధ్వంసాలకు పాల్పడి.. అమాయకులైన 30 మంది ప్రజల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పోలీసులు పలు రాష్ట్రాల పోలీసులు, పూర్తిగా విఫలమయ్యారని కూడా అరోపణలు వస్తున్నాయి.

కాగా, దోషిగా తేలి రోహ్ తక్ జైలుకు తరలివెళ్లిన.. గుర్మీత్ సింగ్ కు జైలులో రాజభోగాలు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులైన వ్యక్తులే ఆయనకు భక్తులుగా వుండటంతో.. ఆయనకు జైలులో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సకల మర్యాదలు అందించాలని అదేశించిన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గుర్మీత్‌కు ప్రత్యేక సెల్‌, మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. ఆయనతో పాటు ఉండేందుకు ఒక అసిస్టెంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఓ వైపు తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో రాజభోగాలను అనుభవిస్తున్నారని, అమెకు ప్రత్యేకంగా వంటగదిని కేటాయించారని, అందుకుగాను అమె నుంచి బెంగళూరు జైలుశాఖ అధికారులు రెండు కోట్ల మేర డబ్బును అందుకున్నారని అరోపణలు సంచలనం రేకెత్తించగా, ఇటు గుర్మిత్ సింగ్ కు కూడా ప్రభుత్వంలోని పెద్దల అండదండలే మెండుగా వుండి రాజమర్యాదలు అందుతున్నాయన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈ నెల 25న, సుమారు రెండు వందల కార్ల భారీ కాన్వాయ్ నడుమ ఆయనను పంచకుల కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణనానికి చేరుకున్న గుర్మీత్‌ వద్ద చాలా బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కన్పించింది. కోర్టు నుంచి రోహ్‌తక్ జైలుకు హెలికాప్టర్ లో తరలిచిన పోలీసులు రోహ్ తక్ వరకు తరలించి అ తర్వాత పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్లారు.

పదిహేనేళ్ల క్రితం తన అశ్రమంలో చేరిన ఇద్దరు శిష్యురాళ్లపై కన్నేసిన ఈ కపట గురువు.. వారిపై అత్యాచారం చేసి.. ఏళ్ల పాటు వారు కనీసం ఆశ్రమం కూడా వదలివెళ్లకుండా వారిని నిర్భందించాడు. ఎట్టకేలకు ఈ దోంగబాబా ఆశ్రమం నుంచి తప్పించుకున్న ఇద్దరు మహిళలు పోలీసులను అశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసును తరువాత సిబిఐకి బదిలీ కాగా, విచారించిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ నెల 28న ఆయనకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. దీంతో మరోమారు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Sacha Sauda  Gurmeet Ram Rahim Singh  Tamil Nadu  BJP  PM Modi  SasiKala  Politics  

Other Articles