Anurag Thakur warned for filming LS proceedings ఆ పని చేసి.. క్షమాపణలు చెప్పిన బీజేపి ఎంపీ

Anurag thakur warned for filming lok sabha proceedings

Anurag Thakur, Anurag thakur Bcci, Anurag thakur news, anurag thakur Mp, anurag thakur lok sabha, anurag thakur filming, anurag thakur bjp, speaker Sumitra mahajan, Sumitra mahajan warned anurag thakur

BJP MP Anurag Thakur’s action leads to protests by opposition members, who demanded that the ruling party MP should be suspended like the Congress members, who were barred from the House for indiscipline.

ఆ పని చేసి.. క్షమాపణలు చెప్పిన బీజేపి ఎంపీ

Posted: 07/27/2017 05:10 PM IST
Anurag thakur warned for filming lok sabha proceedings

అనురాగ్ ఠాకూర్.. బీజేపి ఎంపీగా కన్నా బిసిసిఐ మాజీ అధ్యక్షుడిగా ఈయన దేశప్రజలకు సుపరిచితుడు. బిసిసిఐ అధ్యక్ష హోదాలో ఈయన ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్తానం సుప్రింకోర్టు ఇచ్చిన అదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గానే ఆయన తన పదవినే కొల్పోవాల్సి వచ్చింది. దీంతో నిర్లక్ష్య ధోరణి వహించకూడదని తెలుసుకున్న ఆయన.. ఎంపీగా మాత్రం ఇంకో పాఠం నేర్చుకోవా్లసి వచ్చింది. పార్లమెంటులో చేయకూడని పనిచేసిన ఆయన బేషరుతుగా క్షమాపణలు చెప్పారు. అయినా.. అతడ్ని కూడా సభ నుంచి సస్పెండ్ చేయాలని పార్లమెంటులో డిమాండ్ చేశాయి.

అసలు అనురాగ్ ఠాకూర్ చేసిన చేయకూడని పనేంటి..? ఆయన ఎందుకు బేషరుతు క్షమాపణలు కోరాడు..? విషయంలోకి వస్తే.. కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌తో చిత్రీకరించిన బీజేపి ఎంపీ అనురాగ్‌ ఠాకూర్ వాటిని మీడియాకు కూడా లీక్ చేశాడు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ సభ్యులకు విధించిన సస్పెన్సనే అయనపై కూడా విధించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తన చర్య పట్ల చింతిస్తునట్లు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగి స్పీకర్ సుమిత్రా మహాజన్ పై కాగితాలు విసిరిడంతో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఐదు రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టిన సమయంలో ఆ దృశ్యాలను అనురాగ్ ఠాకూర్ తన మొబైల్ ఫోన్ లో బంధించారు. దీంతో విపక్ష సభ్యులు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, అనురాగ్ ఠాకూర్ మీరు వీడియో తీసి మీడియాకు లీక్ చేసి వుంటే వెంటనే సభకు క్షమాపణలు చెప్పండీ అని స్పీకర్ అదేశించడంతో అయన సారీ చెపి. తన చర్యకు చింతిస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Thakur  lok sabha  moblile phone  filming  speaker  Sumitra mahajan  bjp MP  

Other Articles