tirumala srivari temples remains closed on that day కలియుగ దైవానికి ఆ రోజు సెలవు

Tirumala srivari temples remains closed on lunar eclipse day

tirumla temple remains closed, tirumla remains closed, rest to lord venkateshwara, tirumala tirupathi devasthanam, tirumala tirupathi temple closed, tirumala, balaji, lord venkateshwara swamy, lunar eclipse, TTD, bhakti news

tirumala srivaru who is mostly belived as the diety of kaluyug remains closed on august 7th on the occasion of lunar eclipse.

తిరుమల శ్రీవారికి ఆ రోజు సెలవు..

Posted: 07/27/2017 05:59 PM IST
Tirumala srivari temples remains closed on lunar eclipse day

శీర్షక చూసి విస్మయం చెందారా..? కానీ ఇది నిజం. ప్రతినిత్యం భక్తుల విన్నపాలు, కోర్కెలు విని విని అలసిపోయారో ఏమో తెలియదు కానీ తిరుమల వేంకటేశ్వరుడు ఆ రోజున సెలవు తీసుకోనున్నారు. వేకువజాము నుంచే అర్భకులు మంత్రోచ్ఛరణల నడుమ.. ఓ వైపు భక్త జన దర్శనం.. మరో వైపు నిత్య ప్రత్యేక పూజలు..కళ్యాణ, వసంతోత్సవ సేవలు.. మరోవైపు దైనందిక కైంకర్యాలుతో నిత్యం బిజిబిజీగా వుండే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.. భక్తులు ముద్దుగా శ్రీవారు అని పిలుచుకున్నా.. ఆయనకు శతకోటి సహ్రసనామాలలో ఎలా పిలిచినా పలికే ధైవం.. ఆ రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఇది నిజం.

అయితే స్వామి దర్శనం కోసం వచ్చే భక్త జన సందోహం శ్రీవారిని ఎలా దర్శించుకోవాలని..? అంటే మరుసటి రోజు వరకు వేచి వుండక తప్పదు. అసలు శ్రీవారికి నిజంగా సెలవు అవసరమా..? అంటు అవును అవసరమేనని అంటున్నారు అర్భకబృందం. ఎందుకంటారా..? ఆగస్టు 7న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో శ్రీవారికి సెలవు ప్రకటించారు. ఆగస్గు 7 రాత్రి 10.52 గంటల నుంచి అర్ధరాత్రి 12.48 గంటల వరకు చంద్రగ్రహణం వుంటుందని, దీని దృష్ట్యా శ్రీవారి ఆలయాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు వేకువ జాము వరకు మూసివేయనున్నట్లు పేర్కొంది.

ఆగస్టు 8న వేకువ జామున రెండున్నర గంటలకు ఆలయ తలుపులు తెరుస్తామని తెలిపారు. ఉదయాన్నే అలయాన్ని శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ తరువాత నిత్యం కైంకర్యాలతో స్వామివారికి అరాధన జరుగుతుందని.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలను నిర్వహిస్తామని చెప్పారు. ఆ తరువాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala  venkateshwara swamy  lunar eclipse  TTD  bhakti news  

Other Articles