man founds a bag with 36 lakh cash, carries away లచ్ఛిందేవి వస్తానంటే.. వద్దంటారా..? ఇది నేరం కాదా.?

Man founds a bag with 36 lakh cash carries away

man carries away 36 lakh cash, bag with 36 lakh cash, pedestrian carries away cash bag, pedestrian, man, cash bag, besant road, vijayawada, tension, sangavi gold shop, demand draft, clerk, ramakrishna, crime

A pedestrian founds a bag with 36 lakh cash on besant road in vijayawada, carries away without any tension

ITEMVIDEOS: లక్షల సొమ్ము దొరికినా.. టెన్షన్ లేకుండా తీసుకెళ్లాడు..

Posted: 07/24/2017 04:44 PM IST
Man founds a bag with 36 lakh cash carries away

నవ్యంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ బీసెంట్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు పాదచారులలో ఒకరిని లఛ్చిందేవి వరించింది. ఇంకేముందు అప్పటి వరకు దిగాలుగా, నీరసంగా వేసిన అడుగులు కాస్తా.. వడివడిగా తన గమ్యం వైపు సాగాయి. తనతో పాటు వున్న వ్యక్తికి సమాచారం ఇచ్చాడో లేదో తెలియదు కానీ.. ఇప్పడు అతని కోసం పోలీసులు అన్వేషణ సాగించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో డబ్బును బ్యాంకుకు తీసుకువెళ్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుమాస్తా రామకృష్ణకు మాత్రం పట్టపగలు చుక్కలు కనిపించాయి. అర్థం కాలేదా..? అయితే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.

విజయవాడ బీసెంటు రోడ్డులోని సంఘవి అనే బంగారం యజమాని తన గుమాస్తాకు 36 లక్షల రూపాయల నగదును ఇచ్చి.. వాటిని బ్ాయంకులో జమచేసి డీడీ తీసుకుని రావాల్సిందిగా చెప్పాడు. దీంతో బ్యాంకుకు బయలుదేరిన రామకృష్ణ.. డబ్బుల బ్యాగును తన బైక్ పెట్రోల్ ట్యాంకుపైనున్న కవర్లో పేట్టుకున్న రామకృష్ణ రద్దీ రోడ్డులో కొంత జాగ్రత్తగానే బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకుకు చేరకున్న తరువాత చూసుకోగా, క్యాస్ బ్యాగ్ కనిపించలేదు. దీంతో పట్టపగలు చుక్కలు కనిపించిన రామకృష్ణ.. ఓ వైపు చమలు పడుతుండగా, వణికిపోతూనే తన యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. యజమాని సూచన మేరకు రామకృష్ణ గవర్నర్పేట పోలీసులు కంప్లయింట్ చేశారు. హుటాహుటిన స్పందించిన పోలీసులు.. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రావణి అధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.

ముందుగా వారి దుకాణానికి వచ్చిన పోలీసులు షాపులోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అప్పుడు కాని రామకృష్ణ మనిషి కాలేదు. ఎందుకంటే సిసిటీవీలో పూర్తిగా విషయం అర్థమైపోయింది. బైక్ కవర్ లో పెట్టుకున్న బ్యాగ్.. షాపు ముందే పడిపోయింది. దానిని గమనించని గుమస్తా అలాగే వెళ్లిపోయాడు. అదే దారిలో వచ్చిన పలువురు ఆ బ్యాగ్ ను పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. కాగా అటువైపుగా నడుచుకుంటూ వచ్చిన ఇద్దరిలో ఒకరు మాత్రం ఆ బ్యాగును పరిశీలించి చూశాడు. పాపం ఎవరో బ్యాగు పొగోట్టుకున్నారని.. అనుకున్నట్లు వున్నాడు. వారికి సంబంధించిన సమాచారం వుంటుందేమోనని భావించాడు.

పక్కనే ఉన్న బైక్ పెట్టి.. అందులో ఏ ఆధారమైన దొరుకుంతా అని తెరచి చూశాడు. అతని కళ్లు లోపల వున్న విషయాన్ని గ్రహించి నమ్మలేకపోయాయి. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. అయినాసరే.. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రానీయకుండా.. ఏమీ లేదన్నట్లుగా అక్కడి నుంచి కదిలాడు. అతని కోసం వేచివున్న మరో వ్యక్తికి వద్దకు అడుగులు పెద్దగా వేసుకుంటూ వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరూ అలానే వెళ్లసాగారు. ఈ మొత్తం బంగారం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. సీసీ కెమెరా విజువల్స్ తో పాటు.. వ్యక్తి ఆచూకీ కోసం బెజవాడ పోలీసులు అన్వేషిస్తున్నారు. కాగా సరిగ్గా ఏడాదిన్నర క్రితం అంటే డిసెంబర్ 2, 2015లో కూడా ఇలాగే బెజవాడలోని మొగల్ రాజపురం కాలనీలో ఓ బ్యాగులో పది లక్షల రూపాయల నగదు స్థానికులకు లభించింది. దీంతో షాక్ తిన్న వారు బ్యాగును పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pedestrian  cash bag  besant road  sangavi gold shop  demand draft  clerk  ramakrishna  vijayawada  crime  

Other Articles