Nithari serial killings: Koli, Pandher get death sentence సీరియల్ కిల్లింగ్స్ కేసులో దోషులకు మరణ దండన

Nithari killings pandher koli sentenced to death in pinky sarkar case

Surinder Koli, pinky sarkar, Nithari killings, NITHARI, Moninder Singh Pandher, Crime

Businessman Moninder Singh Pandher and his domestic help Surinder Koli were sentenced to death after being convicted in 2006 serial Nithari rape and murder cases.

సీరియల్ కిల్లింగ్స్ కేసులో దోషులకు మరణ దండన

Posted: 07/24/2017 02:54 PM IST
Nithari killings pandher koli sentenced to death in pinky sarkar case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిథారీ సీరియల్ మర్డర్ల కేసులో వ్యాపారవేత్త వ్యాపారవేత్త మొనీందర్ సింగ్ పాంధర్, అతని ఇంట్లో పనిమనిషి సురీందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు మరణదండన విధించింది. వీరిద్దరూ కలసి పింకీ సర్కార్ ను హత్య చేశారన్న అభియోగాలపై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని నిర్థారించి ఇద్దరినీ దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ ఈ నిథారీ సిరియల్ మర్డర్ల విషయమై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఫాంథర్ తో పాటుగా అతని మరణదండన విధిస్తూ తీర్పును వెలువరించింది.

తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా న్యాయస్థానం ఈ కేసు అత్యంత అరుదైనదని అభిప్రాయపడ్డ పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పవన్ కుమార్ తివారీ తుది తీర్పును వెలువరిస్తూ.. అత్యంత క్రూరారంగా యువతులను హత్య చేసిన వీరిద్దరు దోషులు జీవించే అర్హతను కోల్పోయారని వ్యాఖ్యానించారు. యువతిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం, హత్య ఆరోపణలన్నీ వీరిపై రుజువయ్యాయని తెలిపారు. ఈ కేసులో పనిమనిషి కోలికి.. విధుల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న పింకీ సర్కార్ ను ఇంట్లోకి పిలిచి ఆ తరువాత అమెను అక్టోబర్ 5, 2006లో హత్యచేశారని తమ దర్యప్తులో అంగీకరించినట్లు సిబిఐ తమ చార్జిషీటులో పేర్కొనింది.

కాగా, ఈ కేసులో దర్యాప్తులో భాగంగా డిసెంబర్ 29, 2006న నోయిడా సమీపంలోని నిథారీ ఇంటిని సోదా చేసిన అధికారులకు.. అతని ఇంటి వెనుకభాగంలోని పెరట్లో 19 అస్థి పంజరాలు బయటపడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు 19 కేసులను నమోదు చేయగా, వాటిల్లో 16 కేసుల్లో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. కాగా మూడు కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో వాటిని కొట్టేయాల్సి వచ్చింది. 19 అస్థి పంజరాల్లో అత్యధికం, ఆ ప్రాంతంలో అదృశ్యమైన యువతులవే కావడంతో, పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పింకీ సర్కార్ కేసులో పక్కా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surinder Koli  pinky sarkar  Nithari killings  NITHARI  Moninder Singh Pandher  Crime  

Other Articles