Lightning car while driving China పిడుగు పాటు చూశారా..? చూసి తట్టుకోగలరా.?

Video shows street struck by lightning in china

lightning in China, lightning in China on busy road, lightning in China in heping road, lightning in China in shenyang, feircefull lightning in China, viral video of lightning in China, lightning in China viral video, lightning in China Liaoning province, Chinese micro-blogging site Weibo, Heping Road, Shenyang

A dashcam footage has captured the terrifying moment a flash of lightning struck a busy road in China.The footage was filmed on May 11 during the rush hours in Liaoning province,

ITEMVIDEOS: పిడుగు పాటు చూశారా..? చూసి తట్టుకోగలరా.?

Posted: 05/16/2017 09:21 PM IST
Video shows street struck by lightning in china

ఎక్కడో దూరంగా పిడుగులు పడినట్లు మెరుపులు మెరిసిన తరువాత వినే ఉరుముల శబ్ధం వింటేనే గుండెల్లో రైలు పరుగెడతాయి. భారీ వర్షాలకు ఉరుములు మెరుపులు తోడైతే.. ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం అవుతారు. ఆ శబ్దాల భయానికి అర్జునా ఫాల్గుణా అని అనకుండా వుంటారా..? అంతటి భయకంపితమైన శబ్దంతో కూడిన పిడుగులు కళ్లెదుటే పడితే.. ఆ అనుభవం ఎంత భయానకంగా వుంటుందో చెప్పనక్కర్లేదు.

భారీ విద్యుత్ శక్తితో పడే పిడుగు భూమిని తాకి తాకగానే.. అ ప్రాంతంలో వున్న ఎలాంటి వస్తువైనా భస్మం కావాల్సిందే. అంతటి విద్యుత్ శక్తి తనలో ఇముడ్చుకుని వుంటుంది పిడుగు. మనుషులే కాదు చెట్లు చేమలు, గుట్టులు, ఇలా ఏమున్నా కళ్లు మూసి తెరిచే లోపు బూడిదవ్వక మానదు. అయితే పిడుగు పడిన తరువాత అక్కడ వుండే అవశేషాలను బట్టి మనం పిడుగుపాటు ఎలా వుంటుందో అంచనా వేయగలం కానీ.. కళ్లతో మాత్రం చూడలేము.

అయితే పిడుగు పడినప్పుడు ఎలా పుంటుందో.. ఏ వస్తువైనా ఎలా కాలిబూడిదవుతుందో ఎప్పుడైనా చూశారా. లేదు కదూ.. అయితే అంతటి అనుభవమే ఇప్పుడు మనకు అందుబాటులోకి తీసుకువస్తుంది సోషల్ మీడియా. అదెలా అంటే.. చైనాలో బిజీ రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా, పిడుగు పడటం.. అది కాస్తా అక్కడే వున్న ఓ కారులోని డాష్ కెమెరాలో నిక్షిప్తం అవ్వడం జరిగింది. దీంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

చెనా సోషల్ మీడియా వైభో లో దీనిని కారు యజమాని పోస్టు చేయడంతో కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే దానిని ఏకంగా మూడు కోట్ల 70 లక్షల మంది వీక్షించారు. వివరాల్లోకి వెథ్లే.. చైనాలోని షెన్యాంగ్‌ ప్రాంత ప్రజలు పిడుగు పడటాన్ని ప్రత్యక్షంగా చూశారు. అది కూడా రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్లే వాహన దారులు. ఈ నెల(మే) 11న చైనాలోని లియానింగ్‌ ప్రావిన్స్‌లోగల షెన్యాంగ్‌లో పెద్ద మొత్తంలో గాలిదుమ్ము వచ్చింది. ఆ సమయంలో వర్షంపడటంతోపాటు పెద్ద పెద్ద ఉరుములు శబ్ధం కూడా వినిపిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే ఓ కాలనీలో కారు వాహనదారులు తమ కార్ల వైఫర్లు ఆన్‌ చేసుకొని దూసుకెళుతుండగా నడి రోడ్డుపై భారీ పిడుగు పడింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్లు మాడిపోయి వాటి ఆకులన్నీ కూడా నిప్పుల వర్షంలాగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వారంతా కూడా తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి గజగజ వణికిపోయారు. మొదట ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మినట్లు… ఆ వెంటనే భారీ వెళుతురుతో నిప్పుల వర్షాన్ని కురిపించింది ఆ పిడుగు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lightning  busy road  Heping Road  Shenyang  Liaoning province  china  viral video  

Other Articles