ప్రధాని మోడీపై సెటైర్ విసరిన డింఫుల్ యాదవ్ Mere Angane Mein Jibe Displays Dimple Bhabhi

Mere angane mein jibe displays newly emboldened dimple bhabhi

Uttar Pradesh elections 2017, UP polls 2017, Samajwadi Party, Akhilesh Yadav, Dimple Yadav, Mulayam Singh Yadav, PM Narendra Modi, Rahul Gandhi, BJP. SP, Congress, politics

Dimple Yadav, 39, has managed to hold her own. "Mere angane mein, tumhara kya kaam hai?" she pronounced, with impeccable timing, as a chide to Prime Minister Narendra Modi

ప్రధాని మోడీపై సెటైర్ విసరిన డింఫుల్ యాదవ్

Posted: 02/23/2017 05:03 PM IST
Mere angane mein jibe displays newly emboldened dimple bhabhi

గత సార్వత్రిక ఎన్నికలలో భర్త చాటు భార్యగా రాజకీయ రంగ్ర ప్రవేశం చేసి పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్.. అప్పట్నించి కూడా అటు చట్టసభలో కాని, ఇటు పార్టీ ప్రచార సభలు, సమావేశాల్లొ కానీ పెద్దగా మాట్లాడలేదు. గత సార్వత్రిక ఎన్నికలలో తొమ్మిది స్థానాలు మినహా అన్ని స్థానాలను బీజేపి కైవసం చేసుకుంది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను ఎవరికీ తక్కువ కాదని, ముందుకు దూసుకెళ్తుంది డింపుల్ యాదవ్.

అడది అబల కాదు సబల అని రుజువు చేస్తూ తన భర్తతో పాటు కలసి సభల్లో ప్రసంగిస్తూ ఓటర్లను ఉత్తేజపరుస్తున్న డింపుల్.. అటు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్టీ శ్రేణులతో డింపుల్ కూడా లైంగిక వేదింపులు తప్పించుకోలేరని విమర్శలను తోసిరాజుతూ తాను ఒంటరిగా కూడా సభలు, సమావేశాల్లో పాల్గోంటున్నారు. రెండేళ్ల క్రితం వరకు కేవలం ఇంటివరకే పరిమితమైన డింపుల్.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపైనే సెటైర్ వేశారు. సాధారణంగా బహిరంగ సభలలో ప్రసంగించడం ఒక వంతు కానీ ఏకంగా డింపుల్ పాటలు పాడుతూ ప్రత్యర్థులను వాటితోనే ప్రశ్నిస్తూ.. తన రాజకీయ చతురతను ప్రదర్శించడంపై ఎస్సీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు,

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి ఈ చిత్రం కనిపించింది. డింపుల్ యాదవ్ (39) ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లుగా అటు ప్రధానిని టార్గెట్ చేస్తూనే ఇటు ఓటర్లలలోనూ తనకూంటూ కొత్త ఒరవడిని చేపట్టారు. సభాహుతులు డింఫుల్ భాబి జిందాబాద్ అని నినదించారు. ఇంతకీ అమె ప్రధానిని ఉద్దేశించి ఏమన్నారో తెలుసా..? 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ నిలదీశారు. తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. 1980లలో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'లావారిస్'లోని పాట మొదటి లైనును ఇందుకోసం ఆమె ఎంచుకున్నారు.
 
మెరూన్ రంగు చీర కట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకున్న డింపుల్ యాదవ్.. అలహాబాద్‌లో పోటీ చేస్తున్న విద్యార్థి నాయకురాలు రిచా సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు. తన భర్త ఇంటిపోరు నుంచి బయటపడి.. పార్టీ పగ్గాలను చేపట్టిన నేపథ్యంలో డింపుల్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP polls 2017  Akhilesh Yadav  Dimple Yadav  PM Modi  Rahul Gandhi  BJP. SP  Congress  

Other Articles