అమ్మాయిలకే కాదు.. కుక్కలకు కూడా భద్రత లేదు.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ! | Union Minster comments on Bhavana Molestation Case.

Union minister menaka gandhi demands president rule in kerala

Menaka Gandhi, Menaka Gandhi Actress Bhavana, Maneka Gandhi Kerala Government, Maneka Gandhi Kerala, Maneka Gandhi Demand, Maneka Gandhi President Rule, Kerala Actress Molestation, Pinarayi Vijayan Menaka Gandhi, LDF Government

Maneka Gandhi, union minister for women and child development, came down heavily on the Pinarayi Vijayan-led LDF government in Kerala Monday over the law and order situation in the state. She made strong remarks when quizzed by Manorama News about the recent attack on a young Malayalam actress in a moving car in Kochi.

రాష్ట్రపతి పాలన పెట్టి తీరాల్సిందే!

Posted: 02/21/2017 10:41 AM IST
Union minister menaka gandhi demands president rule in kerala

కేరళలో నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కొత్త డిమాండ్ ను లేవనెత్తుతున్నారు. ఎల్డీఎఫ్ పార్టీ పినరై విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతి భద్రతలను అదుపు చేయటంలో పూర్తిగా విఫలమయ్యిందని అంటున్న ఆమె తక్షణమే అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది.

కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సొంత కారులో వెళ్తున్న సినీ నటిని కిడ్నాప్ చేయడం దారుణమని అన్నారు. ఈ దాష్టీకానికి పాల్పడిన దుండగులను పట్టుకోకుండా మీనమేషాలు లెక్కించడం సరికాదని, శాంతిభద్రతలు పరిరక్షించడంలో పినరయి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కేరళలో క్రిమినల్ గ్యాంగులు రాజ్యమేలుతున్నాయని, చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చివరకు జంతువులను కూడా వదలటం లేదంటూ ఆ మధ్య కుక్కలను సాముహికంగా చంపేయటంపై ఆమె ఫైర్ అయ్యారు. ఇక రాజకీయ నాయకుల అండగా ఉండాల్సింది ప్రజలకే గానీ, నేరగాళ్లకు కాదన్న ఆమె, వారి ప్రోద్భలంతోనే నేరస్థులు తప్పించుకుంటున్నారని ఆరోపించింది కూడా.

కాగా, కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరాకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. సీని నటి భావన కిడ్నాప్, ఆపై కదిలే కారులో లైంగిక వేధింపుల వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు భావన కేసు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 2050 గుండాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Menaka Gandhi  Actress Bhavana  Kerala Government  

Other Articles