పదేళ్లు టీడీపీలోనే ఉంది కదా? ఆ మాత్రం తెలీదా? | MLA Roja asks Chandrababu about her track record.

Ysrcp mla rk roja slams chandrababu and dgp

YCP MLA Roja, MLA Roja, MLA Roja Wrongful Detain, AP DGP MLA Roja, MLA Roja Sensational Comments, MLA Roja Chandrababu Naidu, MLA Roja Vijayawada Press Conference, MLA Roja Track Record, MLA Roja TDP

YCP MLA Roja again slams AP CM Chandrababu Babu Naidu about her detained while she try to attend National Women Parliament Conference. Also Comments on AP DGP over her arrest on that day.

రోజాకు ఆ అర్హత అస్సలు లేదా?

Posted: 02/21/2017 10:15 AM IST
Ysrcp mla rk roja slams chandrababu and dgp

మహిళా పార్లమెంటేరియన్ సభకు స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆహ్వానం పంపినట్లే పంపి తనను తీవ్రంగా అవమానించారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై వేధింపులకు దిగారని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా తెలిపింది. జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు కోడెల కుమార్తె, చంద్రబాబు కోడలు, కేసీఆర్ కుమార్తెలకే మహిళా సాధికారత కావాలా? ఇతరులు మహిళలు కాదా? అంటూ ఆమె ప్రశ్నించింది.

రెండు సార్లు ఆహ్వానం పంపిన స్పీకర్ కోడెల తనను అడ్డుకోవడంపై ఎందుకు నోరు విప్పలేదని ఆమె ఏపీ సీఎంను నిలదీసింది. అసలు తనకు అందులో అర్హత లేదా అని ప్రశ్నించిన రోజా, ఉమెన్ పార్లమెంట్ అంటే భజనపరుల సమావేశమా? అని సెటైరిక్ గా మాట్లాడింది. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో ప్రస్తుతం ఉన్న డీజీపీ నడుస్తున్నారని ఆరోపించిన ఆమె తనను కావాలనే ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఉళ్లన్నీ తిప్పారని చెప్పుకొచ్చింది. ఏమన్నా అంటే రోజా ట్రాక్ రికార్డు పరిశీలించిన మీదటే ఆమెను అడ్డుకున్నామని చంద్రబాబు చెబుతున్నారని.... తన ట్రాక్ రికార్డు ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

 

టీడీపీలో ఉన్న పదేళ్లలో తాను ఎలాంటి రౌడీయిజం చేశానో... లేదా, తనతో ఆయన ఎంత రౌడీయిజం చేయించారో చెప్పాలని ఆమె అడిగారు. లేదంటే తాను ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ కు తీసుకెళ్లి దాచి, సొంత మామను అధికారం నుంచి దించానా? లేకపోతే తన నివాసానికి ఎవరినైనా పిలిచి, వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డానా? అదీ కాకుండా మహిళలపై రావెలలా వేధింపులకు దిగుతున్నానా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

 

ఇవి కూడా చదవండి... 

మగవాళ్లు కాదా? ఆడంగులా? : రోజా

 

రోజా రచ్చ గురించి బాబుకు ముందే తెలుసంట...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Roja  Press Meet  Slam  Chandrababu Naidu  

Other Articles