జయ డెడ్ బాడీతోనే అనుమానాలు మొదలు... | Madras High Court ready on Jayalalitha's death.

Madras hc on jayalalitha death

Madras High Court, Jayalalithaa death, judicial inquiry Jayalalithaa death, AIADMK Jayalalithaa death, Madras High Court Jayalalitha, Jayalalitha death mystery, Amma Madras High Court, PIL on Jayalalitha death

AIADMK man files PIL in Madras HC seeking judicial inquiry into Jayalalithaa death.

అమ్మ మరణం.. అనుమానాలు తీరాల్సిందే!

Posted: 12/29/2016 09:26 AM IST
Madras hc on jayalalitha death

తమిళనాట నేడు రసవత్తరమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఒకటి చిన్నమ్మ శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం, రెండోది జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టడం. శశికళ ఎంపిక ఏకగ్రీవం కాగా, అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెన్నైలోని టీటీడీ కళ్యాణమండపంలో ఇప్పటికే ప్రారంభం అయ్యింది కూడా. ఇక దివంగత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై నెల‌కొన్న అనుమానాలను నివృత్తి చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను నేడు మ‌ద్రాసు హైకోర్టు విచారించ‌నుంది.

జ‌య అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందార‌ని, ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల‌తో క‌మిటీ ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని కోరుతూ చెన్నైలోని అరుంబాకంకు చెందిన జోసెఫ్ ఇటీవ‌ల హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న దానిపై ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని అందులో పేర్కొన్నారు. సెప్టెంబ‌రు 22న జ‌య ఆస్ప‌త్రిలో చేరినప్పుడు రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జి చేయ‌నున్న‌ట్టు చెప్పార‌ని గుర్తు చేశారు.

తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు.

అయితే జ‌య మృతిపై అనుమానాలున్నాయ‌ని, ఏం జరిగింద‌నే వాస్త‌వం ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ‌మూర్తుల‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. దీంతో ఏం జరగబోతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras High Court  Jayalalithaa death  PIL  Judicial Inquiry  

Other Articles