అసెంబ్లీని స్థంభింపజేయాలా.? త్రిపుర ఎమ్మెల్యేలా చేస్తే సరి..! TMC MLA Fled With Speaker's Mace in Tripura assembly

Tripura mla runs away with speaker s mace stalls house

tripura assembly, MLA Sudip Roy Barman, tripura mla run away, tripura-speaker mace, mla ran away with speakers mace in tripura, tripura news, tripura-womanising issue, Trinamool Congress, sex scandal, LEADER OF OPPOSITION, ceremonial mace, Agartala Municipal Council, india news

The Watch-and-Ward staff, led by the Marshal, followed Barman and after half-a-minute brought the mace back, before Speaker Ramendra Chandra Debnath went to his chamber.

ITEMVIDEOS: అసెంబ్లీని స్థంభింపజేయాలా.? ఈ ఎమ్మెల్యేలా చేస్తే సరి..!

Posted: 12/20/2016 11:26 AM IST
Tripura mla runs away with speaker s mace stalls house

త్రిపుర అసెంబ్లీలో ఓ తమాషా ఘ‌ట‌న చోటుచేసుకుంది. తాము డిమాండ్ చేస్తున్న అంశంపై చర్చించేందుకు త్రిపుర అసెంబ్లీ స్పీకర్ రామేంద్ర చంద్ర దేబ్నాథ్ అనుమతించకపోవడంతో నిరసనకు దిగిన విపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కనబెట్టి ముందుగా తాము డిమాండ్ చేస్తున్న అంశాన్ని చర్చించాలని పట్టుబట్టాయి. అయినా స్పీకర్ అనుమతించకపోవడంతో తృణముల్ కాంగ్రెస్ కు చెందిన ఓ విపక్ష ఎమ్మెల్యే ఏకంగా స్పీకర్ మంత్రదండాన్ని తీసుకుని పరుగు లంఖించుకున్నారు.

అసెంబ్లీలో నిరసనల సందర్భంగా ఒక్కసారిగా స్పీకర్ చాంబర్ వద్దకు వెళ్లిన తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సుదీప్ రాయ్ బర్మన్ అక్కడున్న చిన్న బేస్మింట్ లాంటిదానిపైకి ఎక్కి ఒక్క ఉదుటున స్పీకర్ అధికారదండాన్ని చేతబట్టుకుని పరుగులు తీశాడు. అయన వెంట స్పీకర్ సిబ్బందితో పాటు అసెంబ్లీ మార్షల్ కూడా పరుగెత్తారు. దీంతో అక్కడ సీన్ ఒక్కసారిగా చిన్న పిల్లల కోసం రూపొందించే యానిమేష‌న్ సీన్లలా మారిపోయి.. సభలో నవ్వులు పూయించింది.

ఈ స‌మ‌యంలో ఆయ‌న‌ను స‌భ‌లోని స‌భ్యులు అడ్డుకునే ప్రయ‌త్నం చేసినా పట్టుకోండీ చూద్దాం అన్నట్లుగా ఆయన ఏకంగా సభ నుంచి బయటకు వెళ్లారు. అధికార ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ అత‌డి నుంచి ఆ దండాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయ‌త్నించారు. అయితే, అంద‌రి నుంచి త‌ప్పించుకున్న సుదీప్ రాయ్ బర్మన్ స‌భ‌లో ప‌రుగులు పెట్టి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అత‌డిని బ‌య‌ట మార్షల్స్ ప‌ట్టుకొని స్పీక‌ర్ అధికార దండాన్ని తిరిగి తీసుకువచ్చి స్పీకర్ టేబుల్ పై పెట్టారు.

స‌భలో నుంచి దండాన్ని లాక్కొని ప‌రిగెత్తుత్తిన ఘటన దీంతో ఇప్పటికి ఐదో సారి సంభవించింది. అసెంబ్లీలో ఈ ఘటన నేపథ్యంలో తృణ‌మూల్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ పై అధికార పక్షం చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో బర్మన్ సభకు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను స‌భ‌లో డిమాండ్ చేస్తోన్న అంశంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు నిరాక‌రించినందుకే సదరు ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించారు.

అసలు ఎమ్మెల్యే ఎందుకు అధికారదండం తీసుకున్నారు..?

ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సుదీప్ రాయ్ బర్మన్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి నరేష్ జమత్యా ఇరుక్కున్న అత్యాచారం కేసు అంశమై సభలో చర్చించాలని, అయనను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే అందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో తృణముల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులందరూ ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. మంత్రిపై వేటు వేయాలన్నారు. ఈ కేసుకు సంబంధించి అగర్తలా మున్సిపల్ కౌన్సిలర్ మ్రిన్మయ్ సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మంత్రిని మాత్రం ఎలా ఉపేక్షించారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు.

అయినా స్పీకర్ మంత్రిపై చర్చకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో మాణిక్ సర్కార్ క్యాబినెట్ లోని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జోక్యం కల్పించుకుని ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో వుందని, న్యాయస్థానంలో వున్న అంశాన్ని సభలో చర్చిస్తామని విపక్షాలు పట్టుబట్టడం సబబు కాదని అన్నారు. అయినా విపక్షాలకు చెందిన సభ్యులు సంతృప్తి చెందలేదు. దీంతో తృణముల్ కాంగ్రెస్ కు చెందని సుదీప్ రాయ్ బర్మన్ స్పీకర్ మంత్రదండాన్ని తీసుకుని పరుగు లంకించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles