బ్యాంకుల్లో లక్షల కోట్లు.. సామాన్యుడికి తప్పని పాట్లు.. Demonetisation has affected citizens

Oppostion uproar on demonetisation rocks rs proceedings disrupted

Demonetisation, Lok Sabha, Parliament, Parliament Winter Session, Gulam Nabi Azad, Arun Jaitley, BJP, Congress, Rajya Sabha, Taxation Bill 2016, Taxation Law Second Amendment Bill 2016

Oppostion uproar on demonetisation in Rajya Sabha, Government took this decision without planning, who is responsible for so many deaths?: Ghulam Nabi Azad Questions

బ్యాంకుల్లో లక్షల కోట్లు.. సామాన్యుడికి తప్పని పాట్లు..

Posted: 12/07/2016 07:51 PM IST
Oppostion uproar on demonetisation rocks rs proceedings disrupted

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభలు ఇవాళ కూడా కుదిపేసింది. ఉభయ సభల్లో చర్చలకు ప్రతిష్టంభనగా నిలిచాయి. ప్రతిపక్షం, అధికార పక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, ఆయా నేతలకు మద్దతుగా ఎంపీలు నినాదాలు చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరానికి రాని డబ్బులు ఎందుకని ప్రశ్నించారు.

బ్యాంకుల్లో భారీగా నగదు జమ అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వచ్చి చేరాయని ప్రధాని మీడియా, పబ్లిక్ మీటింగుల్లో ప్రజలకు చెబుతున్నారు. మరి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఎందుకని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు బ్యాంకులన్నింటిలో కలిపి ప్రతిరోజూ ఎంత మొత్తం జమ అయ్యిందో, ఎంత ఇస్తున్నారో అనే వివరాలు రహస్యంగా ఎందుకు ఉచుతున్నారని అయన ప్రశ్నించారు. బ్యాంకులకు సంబంధించిన సమాచారాన్ని సభ ముందు ఉంచాలని ఆజాద్ డిమాండ్ చేశారు.

పెద్దనోట్ల ర‌ద్దు త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌పై ఎవ‌రు బాధ్యత తీసుకుంటారని ఆయ‌న అడిగారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇప్పటివ‌ర‌కు క్యూలైన్లలో 84 మంది మృతి చెందార‌ని ఆయ‌న అన్నారు. పెళ్లిళ్లకోసం డ‌బ్బులు అడిగితే బ్యాంకులు ఇవ్వలేమని చెప్పేస్తున్నాయని మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ‌ల్ల ఎంతో మంది ఉపాధి కూడా కోల్పోయారని చెప్పారు. పెద్దనోటు రచ్చతో మధ్యస్థాయి, చిన్నస్థాయి వ్యాపారాలు కూడా దేశవ్యాప్తంగా దెబ్బతిన్నాయన్నారు.

నోట్ల ర‌ద్దు ప‌రిణామాల‌పై ప్రభుత్వం స్పందించాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. స‌మ‌గ్ర చ‌ర్యలు తీసుకోకుండానే పెద్దనోట్ల ర‌ద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశ ప్రజ‌లంద‌రినీ క్యూలైన్లలో ఎందుకు నిల‌బెడుతున్నార‌ని ప్రశ్నించారు. ప్రజ‌లంతా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కుంటున్నార‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన గంధరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు తనకు యాభై రోజులిమ్మని ప్రధాని కోరారని, అయితే ఇప్పటికీ 30 రోజులు గడిచినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని అజాద్ విమర్శించారు.

పెద్దనోట్ల రద్దు అంశంపై తాము చర్చకు సిద్దమేనని, అయితే ప్రతిపక్షాలు మాత్రం చర్చ నుంచి పారిపోతున్నాయని, సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక వంకతో చర్చను ఆపేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, కేవలం టీవీ కవరేజిల కోసమే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయం మీద చర్చజరగాలో దాన్ని మాత్రం జరపడం లేదన్నారు. ప్రతిపక్షానికి ధైర్యం ఉంటే నోట్ల రద్దుపై చర్చను కొనసాగనివ్వాలని జైట్లీ అనడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యులు లేచి నినాదాలు మొదలుపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gulam Nabi Azad  Arun Jaitley  BJP  Congress  Rajya Sabha  Parliament  Demonetisation  

Other Articles