డ్రైవర్ సూసైట్ నోట్ తో వెలుగులోకి ‘గాలి’ భాగోతం.. gali janardhan lands into another trouble

Driver s suicide note alleges gali janardhan reddy laundered rs 100 cr black money

Gali Janardhan Reddy, Karnataka, Driver suicide, Ramesh gowda, Administrative service officer, Bheema nayak, driver mohammed, Maddur, Bellary, black money, money laundering

Former minister Gali Janardhan Reddy's driver Ramesh Gowda has allegedly committed suicide, he claimed to know how Reddy converted Rs 100 crore black money into white suicide letter.

డ్రైవర్ సూసైట్ నోట్ తో వెలుగులోకి ‘గాలి’ భాగోతం

Posted: 12/07/2016 04:08 PM IST
Driver s suicide note alleges gali janardhan reddy laundered rs 100 cr black money

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత కూడా.. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, నితిన్ గడ్కారీలు వారి కూతుళ్ల వివాహాలను అంత అట్టహాసంగా ఎలా జరిపించారన్న ప్రశ్నలు ఏటీయంలు, బ్యాంకుల వద్ద క్యూ లైనల్లో నిలబడుతున్న ప్రజలందరి మదిలో ఉదయించాయి. వీరిని పక్కన బెడితే గనుల అక్రమాస్తుల కేసులో నిందితుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా ఎలా జరిపించాడన్న ప్రశ్నలు సామాన్యులకు నిద్రను దూరం చేశాయి,. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం అసలు పట్టలేదు.

బ్రహ్మణీ పెళ్లి అహ్వాన పత్రిక బయటకు రాగానే ఇంత ఘనంగా తన కూమార్తె వివాహం చేస్తున్నాడన్న సమాచారంతో మాజీ లోకాయుక్త అదేశాల మేరకు ఆదాయశాఖ కూడా వివాహంపై దృష్టి సారించారు. అయినా గాలివారింట పెళ్లి ఏ మాత్రం అంచనాలను తక్కువ లేకుండా నభూతో నభవిష్యతీ అన్నట్లుగా జరిగింది. గాలి జనార్థన్ రెడ్డికి చెందిన అస్తులను, అకౌంట్లను సీజ్ చేసినా.. కనివనీ ఎరుగని రీతిలో ఎలా చేయగలిగాడన్న ప్రశ్నలకు మాత్రం కోదవ లేకుండా పోయింది. పెళ్లికి హాజరైన వారు కూడా ఈ విషయమై చెవులు కోరుకున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం లభ్యం కాక.. ఎవరి పనిలో వారు నిమగ్నమైన తరుణంలో కర్ణాటక అధికారి భీమా నాయక్ డ్రైవర్ రమేష్ గౌడ తన సూసైడ్ నోట్ తో సమాధానం చెప్పాడు. ఇప్పుడిదే అంశం గాలి జనార్థన్ రెడ్డి మెడకు ఉచ్చులా బిగుస్తుంది. గాలి జనార్థన్ రెడ్డి, అయన అనుచరుడు బీజేపి ఎంపీ శ్రీరాములు కలసి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అధికారి భీమా నాయక్ సాయంతో తన పాత నోట్లకు కొత్త నోట్లను మార్చుకున్నారని సమాచారం. ఇందుకోసం గాలి సుమారుగా 20 శాతం అనగా రూ.20 కోట్ల రూపాయలను కూడా కమీషన్ కింద చెల్లించాడని తెలిసింది.

అది చాలదన్నట్లు రానున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా ఇప్పిస్తానని గాలి జనార్థన్ రెడ్డి భీమా నాయక్ కు హామి ఇచ్చారట. ఈ విషయాలన్ని రమేష్ గౌడ తన సూసైడ్ నోట్ లో పేర్కోన్నారని తెలుస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రమేష్ గౌడకు ఎందుకు వచ్చింది..? అని అలోచిస్తున్నారా..? నోట్ల మార్పిడి సమయంలో కొంత నగదు తక్కువగా వచ్చిందని గుర్తించిన గాలి అనుచరులు రమేష్ గౌడను అనుమానించారు.

రమేష్ గౌడ్ ను వారు అతడ్ని బెరించారు. తీసిన డబ్బును తక్షణం తీసుకోచ్చి జమ కట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే అంటూ హెచ్చరికలకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన డ్రైవర్‌ రమేష్‌గౌడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రమేష్ గౌడ రాసిన సూసైడ్‌నోట్‌తో గాలి బాగోతం వెలుగులోకి వచ్చింది. బళ్లారిలో 20శాతం కమీషన్‌తో 100 కోట్ల పాతనోట్లు మార్పిడి చేసినట్లు ఈ లేఖ ద్వారా వెలుగులోకి రావడం.. బీమా నాయక్ అతని డ్రైవర్ మహమ్మద్ లను పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gali Janardhan Reddy  Karnataka  Driver suicide  Bellary  black money  money laundering  

Other Articles