టీమిండియా విజయలక్ష్యం 261 పరుగులు.. India Need 261 Runs to Win Series

India vs new zealand india need 261 runs to win series

India vs New Zealand 2016, india vs new zealand 4th odi, india vs new zealand live, India vs New Zealand Live Sscore, Kane Williamson, MS Dhoni, rohit sharma, ross taylor, virat kohli

New Zealand batted first for the fourth consecutive match in this series, but this time it was out of choice and after the first 50 overs of the match

సిరీస్ గెలుపుకు టీమిండియా విజయలక్ష్యం 261 పరుగులు..

Posted: 10/26/2016 05:43 PM IST
India vs new zealand india need 261 runs to win series

టెస్టు సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై పర్యాటక జట్టు నీళ్లు చల్లడంతో.. చివరి వరకు ఉత్కంఠ కొనసాగించేందుకు బదులు తన సొంత గ్రౌండ్ అయిన రాంఛీ వేదికగా సాగుతున్న నాల్గవ వన్డేలోనే సిరీస్ ను కైవసం చేసుకునేందుకు పూర్తిగా శ్రమిస్తున్న భారత క్రికెటర్ల ముందు కివీస్ 261 పరుగులు విజయలక్ష్యాన్ని నిలిపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 260 పరుగులు చేసింది.

తొలి 15 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ధీటుగా రాణించిన కివీస్ జట్టు.. భారీ స్కోరు దిశగా దూసుకుపోయింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పై భారత అభిమానులలో అశలు సన్నిగిల్లాయి. దీంతో తొలి వికెట్ పడిన తరువాత రెండో వికెట్ గా న్యూజీలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ గుప్తిల్ వెనుదిరగడంతో మ్యాచ్ పై భారత అభిమానులకు ఆశలు సజీవమయ్యాయి. ఆ తరువాత వెంట వెంటనే స్వల్ప స్కోరుకు కివీస్ అటగాల్లు పెవిలియన్ దారి పట్టడంతో భారత్ మ్యాచ్ పై పట్టుబిగించింది.

పర్యాటక జట్టు ఆటగాళ్లలో టామ్ లాథమ్ 39, మార్టిన్ గుప్తిల్ 72, విలియమ్సన్ 41, రాస్ టేలర్ 35, నీషమ్ 6, వాట్లింగ్ 14, డివిసిచ్ 11, సాంట్నర్ 17(నాటౌట్) , సౌథీ 9(నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 2, ధావల్ కులకర్ణి, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఫలితంగా భారత్ ఎదుట 261 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs nz  ms dhoni  virat kohli  team india  newzealand  cricket  

Other Articles