కేసీఆర్ సర్కార్ కి ఆ నలుగురితో ఇబ్బంది తప్పదా? | Supreme Court sets Nov 8 deadline for Telangana Speaker on defections.

Supreme court sets nov 8 deadline for speaker on defections

Telangana Speaker on defections, Supreme Court on defections, defections Telangana MLAs, Supreme Court on Telangana defection MLAs, Telangana defection Congress MLAs, Telangana Congress 4 Defection MLAs

Supreme Court sets November 8th deadline for Telangana Speaker on defections.

ఆ నలుగురి మ్యాటర్ ఇంకేంత కాలం నానుస్తారో?

Posted: 10/27/2016 07:50 AM IST
Supreme court sets nov 8 deadline for speaker on defections

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల వ్యవహారంలో సుప్రీం మరోసారి సీరియస్ అయ్యింది. పెండింగులో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎంతకాలం లోగా తేలుస్తారో చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిర్ణయాన్ని తెలియాజేయాలంటూ డెడ్ లైన్ విధించింది కూడా.

కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ 2014 ఆగస్టులోనే స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు.

అయితే రెండేళ్లు దాటినా పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. గతేడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన దస్తీ నోటీసులను పిటిషనర్‌ స్వయంగా ప్రతివాదులకు అందించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే అవి తమకు అందలేదని స్పీకర్ తరపు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ తెలిపారు. ఆయన వాదనను వ్యతిరేకించిన జంధ్యాల ఇందుకు సంబంధించిన మీడియా క్లిప్పింగులను కోర్టుకు అందించారు.

దీంతో స్పందించిన ధర్మాసనం స్పీకర్ వద్ద ఉన్న పెండింగులో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించడానికి ఎంత సమయం కావాలో వచ్చే నెల 8వ తేదీలోగా కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court Deadline  Telangana Speaker  Defection Congress MLAs  

Other Articles