పాము కాటుతో చనిపోయాడు... ఉప్పు పోసి బతికించారా? | Man dies of snake bite tries to revive him with salt.

Man dies of snake bite tries to revive him with salt

Man dies of snake bite in Bangalore, snake charmer tries to revive Sallt, snake bite tries to revive him with SALT, Salt for Snake, Snake Bite Salt Treatment, Dies man survive with Salt

Man dies of snake bite in Bangalore, snake charmer tries to revive him.

పాము కాటుకి ఉప్పు దెబ్బ...

Posted: 09/30/2016 09:49 AM IST
Man dies of snake bite tries to revive him with salt

మనిషికి తెలివితేటలు, పరిశీలించే గుణం, ప్రశ్నించేతత్వం ఉంటాయి. కాబట్టి, ఏ ఆధారమూ లేకుండా ఏ నమ్మకాన్నీ ఏర్పర్చుకోడు. అందుకే సైన్సు (విజ్ఞానం లేదా జ్ఞానం) ముందు, మూఢనమ్మకాలని దిగదుడుపే అని భావించే అవకాశం ఉంది. కానీ, అదే సమయంలో విత్తు ముందా? చెట్టు ముందా? అనే సామెత కూడా అన్వయించుకోకతప్పదు. అందుకే ఏళ్ల తరబడి సాంప్రదాయలనే ముసుగులో ఉన్న మూఢనమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడు. ఆ సోదీ పక్కనబెడితే బెంగళూర్ లో జరిగిన ఓ ఘటన గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

పాము కాటుకి గురై చనిపోయిన ఓ వ్యక్తిని అతని కుటుంబం తిరిగి బతికించేందుకు ఏం చేసింది. ఓ మాంత్రికుడు చెప్పిన మాటలను పట్టుకుని వారు చేసిన పిచ్చి పనికి ఎలాంటి స్పందన లభించిందో తెలుసుకుందాం. ఖానాపూర్, అవ్రోలి గ్రామానికి చెందిన రుద్రప్ప పిలోలి(24) బుధవారం పాము కాటుకి గురై చనిపోయాడు. పోలం పనులకు వెళ్లి వస్తున్న అతన్ని పాము కరవగా, ఏదో పురుగు అనుకుని భ్రమ పడిన అతను, రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో నురగలు కక్కుకుంటూ చనిపోయాడు.

కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. బీడీ గ్రామంలో ఓ పాము తాంత్రికుడు ఉన్నాడని తెలుసుకున్న కుటుంబీకులు అతన్ని సంప్రదించారు. ఇక అతగాడేమో ఓ బిత్తరపోయే సలహా ఇచ్చాడు. అతని మృతదేహాంపై కుప్పగా ఉప్పు పోసి ఉంచాలని, కొద్ది సేపయాక అతను ప్రాణాలతో తిరిగి వస్తాడని చెప్పారు. దీంతో నిజమని నమ్మిన ఆ కుటుంబ సభ్యులు పోస్టు మార్టంను పక్కన పెట్టించి మరీ ఆ పని చేశారు.

గ్రామస్తులంతా విషయం తెలిసి గుంపులుగా అక్కడికి వచ్చేశారు. నేలపై శవాన్ని పడుకోబెట్టి మీద ఉప్పు కుప్పగా పోసి ఉంచారు. ఒక గంట అయిపోయింది. ఆపై మరోక గంట కూడా ముగిసింది. ఇక చివరకు మాంత్రికుడి మాటలు ఉత్తవేనని నిర్ధారించుకుని శవాన్ని పోస్ట్ మార్టం కోసం అప్పగించి, ఆపై దహన సంస్కారాలు నిర్వహించారు.

మూఢనమ్మకాలూ మానవుడివే. జంతువులకు సైన్సు లేదు, మూఢనమ్మకాలూ లేవు. సైన్సును, నిజజీవితాన్ని మేళవింపు చేసుకోనంత వరకూ అలాంటి పిచ్చి నమ్మకాలు ఈ మోడ్రన్ యుగంతోపాటు సమాంతరంగా నడుస్తూనే ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Man  Snake Bite  Died  Salt Treatment  Survive  

Other Articles