మనప్పురం కస్టమర్ల నెత్తిన శఠగోపం.. 30 kg gold loot at gun-point from Manappuram Gold in Jaripatka

6 masked men loot 30 kg gold worth rs 9 crore at gun point from manappuram gold in jaripatka

6 masked men, gold robbery, gold theft, gold loot, 30 kg gold robbery, Rs 9 crore worth gold theft, Manappuram Gold, Jaripatka

a gang of six masked men stormed the Jaripatka Branch of Manappuram Gold Loan and looted a staggering 30 kg of gold at gun-point

మనప్పురం కస్టమర్ల నెత్తిన శఠగోపం..

Posted: 09/28/2016 08:42 PM IST
6 masked men loot 30 kg gold worth rs 9 crore at gun point from manappuram gold in jaripatka

మణప్పురం బంగారు రుణ సంస్థను టార్గెట్ చేసిన ముసుగు దొంగలు కస్టమర్లకు శఠగోపం పెట్టారు. సంస్థలోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆరుగురు ముసుగు దొంగలు సుమారుగా 9 కోట్ల రూపాయల విలువైన బంగారు అభరణాలను దొచుకెళ్లినట్లు సమాచారం. మహారాష్ట్రలో నాగపూర్‌ లోని జరిపట్క్ ప్రాంతంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ ఆఫీస్‌ ను టార్గెట్ చేసిన దొంగలు ముందుగా పలుమార్లు రెక్కీ నిర్వహించి ఆ తరువాత క్రితం రోజున సాయంత్రం ారుగురు ముసుగు దొంగలు లోనికి ప్రవేశించి.. తుపాకులతో బెదిరించి ముప్పై కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు.

మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ ను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలపై జరిగే చోరీల కంటే మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో ఎక్కువ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలోని దొంగలు రెప్పపాటు కాలంతో చకచకా దోపిడీకి పాల్పడి తమ పని పూర్తి చేసుకుని రివ్వును పరారవుతున్నారు. గత కొన్న నెలల క్రితం ఇదే తరహాలో దోపిడికి పాల్పడిన ఘటన విచారణ ఇంకా ఒక కొలిక్కి రాకముందే.. అదే తరహాతో మరో దోపిడికీ పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సిసిటీవీ ఫూటేజీని పరిశీలించి దోంగల అచూకీ కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కస్టమర్లు తాము తనఖా పెట్టిన బంగారం పోయిందంటూ లబోదిబోమంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles