భారత్ తొలి దెబ్బకి పాక్ గిల గిల | Islamabad SAARC summit cancelled

Islamabad saarc summit scrapped

SAARC-2016 scrapped, Islamabad SAARC summit cancelled, India First punch to Pak after Uri attack, After Uri India Revenge, Three countries oppose SAARC, SAARC countries support too India, Pak single, Pak alone from SAARC, SAARC meaning, SAARC support, SAARC updates

After India, 3 More Nations Pull Out Of SAARC 19th summit held at Islamabad, cancelled.

పాక్ కి భారత్ మార్క్ గ..ట్టి... దెబ్బ

Posted: 09/28/2016 04:29 PM IST
Islamabad saarc summit scrapped

అంతర్జాతీయ సమాజం నుంచి తమను వేరే చేయాలని ప్రయత్నిస్తే... ఇండియానే నష్టపోయి.. చివరకు ఏకాకిగా మిగులుతుందని వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే పాక్ కు ఊహించని షాక్ తగిలింది.నవంబర్ 9,10వ తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా జరిగే సార్క్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రస్తుతం సార్క్ చైర్మన్ హోదాలో ఉన్న నేపాల్‌ ప్రకటించింది. సార్క్ సభ్యదేశాలుగా ఉన్న బంగ్లాదేశ్, భూటన్, అఫ్ఘనిస్థాన్ లు సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకోవటంతోపాటు, పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని కోరుతున్నాయి. దీంతో సమావేశాలను రద్దు చేయాలని నేపాల్ డిసైడ్ అయ్యింది. వేదిక మార్చి స‌మావేశాలు నిర్వ‌హించే ప్ర‌తిపాద‌న కూడా ఉన్నా.. ఇప్ప‌టికే నాలుగు స‌భ్య‌దేశాలు(భారత్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్) అలాంటి డిమాండ్ కూడా ఏమీ చేయ‌కుండా స‌మావేశాల్లో పాల్గొన‌బోమ‌ని తేల్చి చెప్పాయ‌ని ఆ దౌత్య వ‌ర్గాలు చెప్పాయి.

దక్షిణాసియాలో సుస్థిరత, శాంతి కోసమే సార్క్‌ను ఏర్పాటు చేశారు.....కానీ ఇటీవల పెరిగిన తీవ్రవాద వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయని భూటన్ తెలిపింది. పెరుగుతున్న ఉగ్రవాదాన్ని తెలిగ్గా తీసుకోలేమని అందుకే 19 వ సార్క్ సమావేశానికి హాజరు కాలేమని ఆ దేశం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక అఫ్ఘనిస్థాన్ కూడా తమ అభిప్రాయాన్ని సార్క్ ఛైర్మన్‌కు తెలిపింది. తీవ్రవాదులు ప్రేరిపిస్తున్న హింసకు వ్యతిరేకంగా జరగుతున్న పోరాటంలో తమ అధ్యక్షుడు బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నాడని, కాబట్టి ఈ సమావేశానికి వచ్చే అవకాశం లేదని ఆ దేశం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా భారత్ లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మౌజెమ్ అలీ మాట్లాడుతూ, సార్క్ సమావేశాలకు హాజరుకామని నాలుగు దేశాలు నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని, ఈ విషయాన్ని గుర్తించాలని యూఎన్ఓను కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఏకాకిని చేయాలని అన్నారు. భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాకిస్థాన్ ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుందో అది దాని ఇష్టమని అన్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి ఐక్యరాజ్యసమితికి ఓ విజ్ఞప్తి కూడా చేసింది. మరోవైపు శ్రీలంక కూడా ఇండియా లేకపోతే ఈ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది.

కాగా, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో నవంబర్ లో జరగనున్న సార్క్ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ను ఫాలో అవుతున్నట్లు బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గానిస్థాన్ దేశాలు ప్రకటించేశాయి. కాగా, మొత్తం సార్క్ లో 8 దేశాలు భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. యూరీ ఉగ్రదాడి తర్వాత పేలుతున్న మాటల తుటాలతో అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలని నిర్ణయించుకున్న భారత్ లక్ష్యానికి రోజురోజుకు మద్ధతు పెరుగుతుండగా, తాజా పరిణామాలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  19th SAARC summit  Islamabad  Cancelled  

Other Articles