తన పదవి కోసం కాపుల ఐక్యతను చీలుస్తున్న చంద్రబాబు mudragada alleges phone tapping on ap government

Mudragada alleges phone tapping on ap government

mudragada, mudragada padmanabham, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, emergency, kapu leaders, tuni violence, mudragada padmanabham chandrababu, amalapuram, kapu differences, NTR,

Kapu caste leader Mudragada padmanbham alleges that andhra pradesh government tapping his phone calls and put an eye on his daily programmes

తన పదవి కోసం కాపుల ఐక్యతను చీలుస్తున్న చంద్రబాబు

Posted: 09/11/2016 10:13 AM IST
Mudragada alleges phone tapping on ap government

కాపు సామాజిక వర్గానికి న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి ఎవరైనా నేతను ముందుండి నిలిపితే తాను పక్కకు తప్పుకుంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. తనను కాపు జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. "దమ్మూ, ధైర్యం ఉంటే, చేతనైతే తునిలాంటి మీటింగ్ పెట్టి నన్ను తరిమి కొట్టించండి. అప్పుడు మీ సత్తా చూపినట్లవుతుంది. అంతే తప్ప, ముద్రగడ కాపు ద్రోహి. కాపుల్లో చెడబుట్టాడని తప్పుడు మాటలు చెప్పించొద్దని అన్నారు.

కాపుల అభ్యున్నతి కోసం తాను సాగిస్తున్న ఉద్యమంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయనన్నారు. ఇంటి వరండాలో కూర్చుంటాను. ఎంతమందితో కొట్టిస్తావో కొట్టించు. చెప్పులతో కొట్టాస్తారో... రాళ్లతో కొట్టిస్తారో మీ ఇష్టం. ఉన్నపళంగా ఆస్తి, అప్పులు వదిలేసి పోతాను. కానీ, మా సోదరులతో తప్పుడు ఆరోపణలు చేయించి, మా మధ్య తగవులు పెట్టకండి. ఇప్పటికే గ్రామాల్లో మూడేసి, నాలుగేసి గ్రూపులు తయారయ్యాయి. సిగ్గుమాలిన పని ఇది. మీ బతుకు కోసం, మీ కుర్చీని కాపాడుకునేందుకు మా జాతిని విడదీయ వద్దు. తప్పిది... క్షమించరాని నేరమని తెలియజేస్తున్నాను" అని ముద్రగడ నిప్పులు చెరిగారు.

కాపులకు న్యాయం చేస్తానన్న చంద్రబాబునాయుడు, తన హామీని వెంటనే నెరవేర్చుకుంటే, మరోసారి దీక్ష చేపడతానని కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. కాపు ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం తదుపరి ఎలాంటి కార్యాచరణకు దిగాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపిన ఆయన, తన రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు.

తన ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. అయితే, బెదిరింపు ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తుండటం మంచిది కాదని, దీనివల్ల సమస్యలు పెరుగుతాయని అన్నారు. మాటిమాటికీ తమ కుల నాయకులతో తనను తిట్టిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని హితవు పలికారు. వేధింపుల్లో భాగంగానే తన కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్యానంతరం కాపులపై ఉగ్రవాదుల కోసం తయారు చేసిన టాడా చట్టాన్ని ప్రయోగించాలని కూడా చూశారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padmanabham  chandrababu  ap government  kapu differences  

Other Articles