ఆరేళ్ల పిల్లాడిపై అక్కాచెల్లెల అత్యాచారం | Deaf paedophile sisters abused a six-year-old boy and then repeatedly molested him

Deaf paedophile sisters abused a six year old boy

Deaf paedophile sisters, Sisters rape boy, Sisters molesting boy, sisters abused boy

Deaf paedophile sisters abused a six-year-old boy and then repeatedly molested him

ఆరేళ్ల పిల్లాడిపై అక్కాచెల్లెల అత్యాచారం

Posted: 08/22/2016 11:26 AM IST
Deaf paedophile sisters abused a six year old boy

అంగవైకల్యం ఉన్న ఆ ఇద్దరు అక్కాచెల్లెలు చేసిన పనికి చివాట్లు పెడుతున్నారు. సిగ్గు లేకుండా 14 సంవత్సరాలుగా ఓ బాలుడిపై ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కింగ్ టోన్ కి చెందిన సిస్టర్ ల కామ క్రీడ విషయంలోకి వెళ్లితే...  

జులీ ఫెలోస్(30), జెన్నిఫెర్(32) పుట్టుకలతో చెవిటితనం ఉన్న అక్కాచెల్లెళ్లు. జూలీ కి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓసారి ఆ అబ్బాయితో తొలిసారి ఓ పెట్రోల్ బంక్ టాయ్ లెట్ లో సెక్స్ లో పాల్గొందట. ఆపై 2000 సంవత్సరం 2014 దాకా అక్కాచెల్లెలు ఇద్దరు మార్చి మార్చి ఆ బాలుడిని శారీరకంగా వాడుకున్నారంట. మొదట్లో జూలీ తనపై ఆప్యాయత చూపుతుందని ఆ బాలుడు భావించాడంట. అయితే రాను రాను ఆమె తనతో మితిమీరి ప్రవర్తించడం, అసహజ రీతిలో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తేవటం, ఆపై అక్కాచెల్లెలు ఇద్దరు కలిసి తనను లైంగికంగా వాడుకోవటం మొదలుపెట్టారని ఆ బాలుడు చెబుతున్నాడు. చివరకి స్నేహితుల సాయంతో పోలీసులను కలిసి అంతా వివరించానని అంటున్నాడు.

ఈ ఘోరం 14 ఏళ్లపాటు కొనసాగిందని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వారిద్దరూ చాలాసార్లు ఆ బాలుడిపై అత్యాచారానికి తెగబడ్డారని వివరించారు. ఇక అక్కాచెల్లెలు ఇద్దరు ఆరోపణలను అంగీకరించారు. దీంతో  వోర్సెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయస్థానం నిందితులను దోషిగా తేల్చింది. అయితే వారికి కఠిన శిక్ష విధించకుండానే కోర్టు కనికరించింది. వీరిని జైలుకు పంపడం కంటే, ఒంటరిగా మంచిదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అలాగే అత్యాచారానికి గురైన బాలుడితో వీరిని కలవనీయకుండా చూడాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paedophile sisters  deaf  molesting  boy  

Other Articles