This Girl's Sister Mistook Hair Removal Cream For Shampoo And The Results Are Kind Of Hilarious

Girl goes bald after mistaking hair removal cream for shampoo

Kayla Conners, huge bald patch, shampoo, Massachusetts, Nair hair removal cream, virals, social media, twitter, photography, lol, wtf, humor, omg, sister, troll, fake, real, generation, highlights, old school

Kelsey had supposedly used Nair to wash her hair.... and the pics went viral after her sister shared them on Twitter

షాంపూ బదులు ఆ క్రీమ్ రాసి అబాసుపాలైంది..

Posted: 07/29/2016 03:05 PM IST
Girl goes bald after mistaking hair removal cream for shampoo

అమెరికాలోని మస్సాచుసెట్స్‌లో ఓ యువతికి ఘోర పరాభవం ఎదురైంది. అంతేకాదు.. ఇలా మరెవరూ ఈ ప్రమాదం బారిన పడకూడదంటూ బాధితురాలి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి ప్రస్తుతం పెను సంచలనంగా మారాయి. దీంతో పోతే పోనీ బొచ్చే కదా అనుకుంటే.. పరువు కూడా పోయిందని ఆ యువతి తన నాలుగు గోడలనే ప్రపంచంగా భావించి అందులోంచి బయటకు రావాలంటే కూడా అయిష్టత ప్రదర్శిస్తుంది. ఇంతకీ విషయమేమింటే.. మాస్సాచుసెట్స్ లో నివసించే కయ్‌లా కొన్నోర్స్ ఇంటికి అమె సోదరి వచ్చింది.

ఎంచక్కా అ రోజు కొన్నోర్స్ లో ముచ్చట్టు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపిన అమెకు మరుసటి రోజు ఉదయం మైండ్ బ్లాక్ అయ్యింది. స్నానానికని బాత్ రూమ్ లోకి వెళ్లిన అమె షాంపూ అనుకుని నెయిర్ కంపెనీకి చెందిన సెంటెడ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ పెట్టుకుంది. తలకు అప్లై చేసిన కొద్ది క్షణాల్లో.. మీరు ఊహించినదే జరిగింది. జట్టంతా ఉడుతూ ఆమె చేతిలోకి వచ్చేసింది. తెప్పలు తెప్పలుగా జుట్టు ఊడటాన్ని గమనించిన బాధితురాలు షాక్‌కు గురై తన అక్క కయ్‌లా కొన్నోర్స్ కు విషయాన్ని చెప్పి  లబోదిబోమంది.

మరోవైపు గుండుగా మారిన తన సోదరి తల ఫొటోలు తీసిన అమె సోదరి కోయ్‌లా కొన్నోర్స్ సోషల్ మీడియాలో పెట్టింది. హెయిర్ రిమూవల్ లోషన్‌ను పొరపాటున నెత్తికి పెట్టుకుంటే అంతే అంటూ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇలాంటి పోరబాటును మరెవరూ చేయకూడదని చెబుతూ కామెంట్ కూడా పెట్టింది. అంతే ఈ ఫోటోలు కొద్ది సేపట్లోనే వైరల్ గా మారాయి. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందనలతో పాటు కామెంట్లు కూడా వెల్లివిరిసాయి. కొందరు ఆమెపై జాలిపడుతుంటే మరికొందరు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మరికోందరైతే అచ్చంగా అలా వున్నావంటూ బట్టతల వున్న అవతలి వ్యక్తితో పోల్చేశారు. ఇక మరికోందరు తాము నవ్వలేకపోతున్నామంటూనే తెగ నవ్వేస్తుండగా.. ఇంకోందరు మాత్రం అమెకు విగ్ కొనివ్వండీ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kayla Conners  huge bald patch  shampoo  Massachusetts  Nair hair removal cream  viral  

Other Articles