Championing Optimism, Obama Hails Clinton as His Political Heir

Barack obama slams trump makes appeal for hillary clinton

President Barack Obama, democratic nominee, Hillary Clinton, Republican nominee, Donald Trump, Bill Clinton, custodian of his legacy, Hillary Rodham, Democratic National Convention, Presidential Election of 2016, Democratic Party, Speeches and Statements

President Obama made a fervent plea for Hillary Clinton, casting the Democratic nominee as a custodian of his legacy while rejecting Republicans' message as fostering anger and hate.

హిల్లరీకే అధ్యక్షురాలయ్యే అర్హతలు అధికం..

Posted: 07/29/2016 01:22 PM IST
Barack obama slams trump makes appeal for hillary clinton

హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష వారసత్వాన్ని అందేంచేందుకు తాను సంతోషంగా వున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమె చేతుల్లో అమెరికా మరింత గొప్ప దేశంగా పరఢివిల్లుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. తనకన్నా.. తనకు ముందుగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బిల్‌ క్లింటన్ కన్నా అమెకే అగ్రరాజ్యానికి అధ్యక్షురాలైయ్యే అర్హతలు అధికంగా వున్నాయన్నారు. ఈ విషయంలో అమెతో మరెవరూ పోటీపడలేరని అయన ధీమా వ్యక్తం చేశారు. ఆమెకు బాధ్యతలు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇకపై తాను తన పనిని ఓ సాధారణ పౌరునిగా చేస్తానన్నారు. ఇక మనం చేయగలిగే మంచి పని ఏమిటంటే.. దేశ తదుపరి అధ్యక్షురాలిగా హిల్లరీని ఎన్నుకోవడమేనని ఒబామా అమెరికన్లకు పిలుపునిచ్చారు.

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైన నేపథ్యంలో పార్టీ జాతీయ కన్వెన్షన్ మూడో రోజు ఒబామా డెలిగేట్లను, ప్రతినిధులను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీపై ఒబామా ప్రశంసలు కురిపించారు. హిల్లరీకి అధ్యక్ష భవనంలో ఏం జరుగుతుందో పూర్తి అవగాహన ఉందని, కానీ రిపబ్లికన్ అభ్యర్థి రాజకీయ నాయకుడు కాదని, ఆయనకు ఇలాంటి వాటిపై అవగాహన లేదని ఒబామా పేర్కొన్నారు. ‘‘ఓవల్ ఆఫీసుకు ఏం కావాలో మనకు ముందుగా తెలియదు. ఒకసారి మనం ఆ డెస్క్‌పై కుర్చున్న తర్వాతే అది అర్థమవుతుంది. ప్రపంచ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి..? యువకులను యుద్ధానికి పంపాలా..? వంటి అంశాల గురించి మనకు ఏమీ తెలీదు.

కానీ హిల్లరీ ఆ రూమ్‌లో ఉంటే మనకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. ఇలాంటి నిర్ణయాల్లో ఇప్పటికే ఆమె పాలుపంచుకున్నారు. ఆయన(ట్రంప్)కి సరైన ప్రణాళిక అనేది లేదు. ఆయన వాస్తవవాది కాదు. తనది వ్యాపార మనస్తత్వం అని స్వయంగా ఆయన చెప్పుకుంటారు. అది మాత్రం ముమ్మాటికీ నిజం’’ అని పేర్కొన్నారు.  రెండు సార్లు అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని, సురక్షితమైన చేతుల్లో అమెరికాను పెడుతున్నానని నమ్మకంగా చెప్పగలనన్నారు.  ఒబామా ప్రసంగం చివరిలో హిల్లరీ స్టేజిపైకి రావడంతో సదస్సు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. వేదికపై హిల్లరీని ఆలింగనం చేసుకున్న ఒబామా.. తన మాదిరిగానే హిల్లరీని కూడా ఆదరించాలని కోరారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Hillary Clinton  Donald Trump  Bill Clinton  Presidential Election of 2016  

Other Articles