Teenage Girl Raped and Blackmailed In Faridabad of Haryana

Man arrested for rape and blackmailing16 year old girl in haryana

rape, gangrape, mimbai, 16 yr old girl, minor girl, rape, 16 yr old girl, minor girl, blackmail, lalith, faridabad, haryana, molest, minor girl sexual assault, molestation, sexual harrasment, sexual assult, crime

A 16-year-old girl was allegedly raped and blackmailed by a person lalith in faridabad of haryana. police send him behind the bars after registering a case against him

మైనర్ బాలికపై అత్యాచారం.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్

Posted: 07/27/2016 07:05 AM IST
Man arrested for rape and blackmailing16 year old girl in haryana

నవ యవ్వనంలో ఇద్దరు యువతీ యువకుల మధ్య పుట్టేది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమేనన్న నిజం తెలుసుకునే సమయానికి ఆ యువతి తన సర్వం కోల్పోయింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా.. పెడచెవిన పెట్టిన యువతి అనుకోకుండా ఓ యువకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. అంతేకాదు అతని బ్లాక్ మెయిలింగ్ తో తీవ్ర మనోవేదనకు కూడా గురైంది. దీంతో కుటుంబసభ్యులు బాలికను పరిస్థితి తెలుసుకుని అరా తీయగా విషయం బయటపడింది. బాధితురాలిని తీసుకుని వెళ్లిన కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హరియాణాలోని ఫరీదాబాద్లో ఇంటర్ విద్యార్థిని (16) అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన కేసులో లలిత్ (21) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మెడికల్ స్టోర్లో పనిచేస్తున్న లలిత్ కొంతకాలంగా వేధిస్తున్నట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

గత నెలలో లలిత్ తనను బలవంతంగా అతని స్నేహితుడు గౌరవ్ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నగ్నంగా ఫొటోలు తీసి, ఈ విషయం బయటచెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని లలిత్ బెదిరించినట్టు తెలిపింది. ఈ నగ్న ఫొటోల ద్వారా బ్లాక్మెయిల్ చేసి మరోసారి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  16 yr old girl  minor girl  blackmail  lalith  faridabad  haryana  crime  

Other Articles