UK MP seeks probe into honour killing of British national in Jhelum

Man claims british wife victim of honour killing in pakistan

honour killing, bradford woman, briton dead in pakistan, honour killing, samia shahid, pandori village, nawaz sharif, syed mukhtair kazam, latest world news

British Pakistani Labour MP from Bradford West Naz Shah has called on Pakistani Prime Minister Nawaz Sharif to take interest in a case of alleged “honour killing” involving a British Pakistani girl who married a Pakistani national of her own free will.

పాకిస్తాన్ పరువు హత్యపై దర్యాప్తు కోరిన బ్రిటన్

Posted: 07/27/2016 07:51 AM IST
Man claims british wife victim of honour killing in pakistan

తన భార్యను అమె తల్లిదండ్రులే హత్య చేశారని అమె భర్త అరోపిస్తున్న నేపథ్యంలో ఇది కాస్తా రెండు దేశాల మధ్య అంశంగా మారిపోయింది. కుటుంబ పరువు కోసం తన భార్యను అమె తల్లిదండ్రులే చంపేశారంటూ అమె భర్త అరోపిస్తుండడంతో బ్రిటెన్ విదేశాంగ శాఖ తో పాటు బ్రిటెన్ పార్లమెంటు సభ్యురాలు కూడా ఏకంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ కు లేఖ రాశారు. పాకిస్థాన్ లో జరిగిన పరువు హత్యకు, బ్రిటెన్ దేశానికి సంబంధమేమిటి అని అలోచిస్తున్నారా..? అయితే మృతురాలు బ్రటెన్ పాకిస్థానీ కావడమే అందుకు కారణం.

పాకిస్థాన్ కు చెందిన అమె తల్లిదండ్రులు అమెకు బ్రిటెన్ లో జన్మనిచ్చారు. దీంతో అమెకు అక్కడి పౌరసత్వం లభించింది. కాగా అమె అక్కడే పెరిగి పెద్దదైంది. అనంతరం అక్కడే తనకు నచ్చిన ఓ వ్యక్తిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఇది అమె కుటుంబ సభ్యులకు నచ్చకే అమెను అంతమొందించారని, పరువు హత్యకు పాల్పడ్డారని అమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ముఖ్తర్ కజీమ్ అనే ఆ వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలోని జీలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

తన భార్య సామియా షహీద్ (28) బ్రిటిష్ - పాకిస్థానీ జాతీయురాలని, తాము రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంటున్నామని చెప్పాడు. సామియా బ్రాడ్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యుటీషియన్ కోర్సు చేసింది. పెద్దల ఆమోదం లేకుండా పెళ్లి చేసుకున్నామన్న కోపంతో వాళ్లు తన భార్యను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె సహజంగానే మరణించిందని, అందువల్ల విచారణ అక్కర్లేదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. సామియా మరణించిన వెంటనే అటాప్సీ చేయించామని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ అఖీల్ అబ్బాస్ తెలిపారు.

పాకిస్థాన్లో బంధువులకు తీవ్ర అనారోగ్యంగా ఉందని తెలియడంతో కజీమ్, సామియా జూలై 14న ఇస్లామాబాద్ వెళ్లారు. సామియా గత గురువారమే తిరిగి దుబాయ్ రావాల్సి ఉంది. కానీ ఆమె గుండెపోటుతో  మరణించినట్లు ఆమె బంధువు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పరువు కోసమే ఆమెను చంపించడానికి వాళ్లు అనారోగ్యం నాటకం ఆడారని కజీమ ఆరోపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles