Car trouble for murder suspects delays court proceedings

Dead man walks into krugersdorp court

Dead man walks into Krugersdorp court, johenes burg, court, krugersdorp, citizen, the citizen, news, Krugersdorp Magistrates, Court, suspect, police custody, facebook, condolence, dead man,

A man understood to be dead by family and friends appeared in the Krugersdorp Magistrates’ Court this afternoon, June 29,

అరు నెలల క్రితం చనిపోయాడు.. ఇవాళ కోర్టులో హాజరయ్యాడు

Posted: 07/01/2016 07:53 AM IST
Dead man walks into krugersdorp court

కారు ప్రమాదంలో మరణించాడనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా బతికి తనపై వున్న కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఎదుట హాజరయితే.. ఎలా వుంటుంది. చీటింగ్, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని కుటుంబసభ్యులు, బందువులలతో పాటు పోలీసులు కూడా భావించారు. అయితే మరణించాడనుకున్న వ్యక్తి ఏకంగా న్యాయస్థానంలో ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపర్చారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో క్రుజర్స్డోర్ప్ కోర్టులో జరిగింది.

31 ఏళ్ల వ్యక్తి(పేరు వెల్లడించలేదు) గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు భావించారు. సంఘటనా స్థలంలో పూర్తిగా కాలిపోయిన ఓ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. మరణ వార్త విన్న స్నేహితులు, బంధువులు అతని ఫేస్ బుక్ పేజిలో నివాళులు కూడా అర్పించారు.మొత్తం సంతాప సందేశాలతో అతిని ఫేస్ బుక్ నిండిపోయింది. స్నేహితులు, బంధువులు అందరూ అతని మరణించాడేమే అని అతనితో ఉన్న జ్ఞాపకాలను ఫేస్బుక్ పేజీలో పంచుకున్నారు.

మరణించాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా కోర్టులో ప్రత్యక్షమవ్వడంతో బంధువులు, స్నేహితులతో సహా తెలిసినవారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. క్రుజర్స్డోర్ప్ మెజిస్ట్రేట్ ముందు పెరిగిన గడ్డం, చెవికి పోగుధరించి ఉన్న ఆ వ్యక్తి కోర్టులో విచారణకు హాజరయ్యాడు. ఈ నెల 26న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు లో హాజరపరిచారు. ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్కు, ఆ వ్యక్తి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కోర్టు అతన్ని వారం రోజులపాటూ పోలీస్ కస్టడీకి అప్పగించింది. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో లభించిన మృతదేహం ఎవరిది అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krugersdorp Magistrates  Court  suspect  police custody  facebook  condolence  

Other Articles