modis book fekuji is in delhi now sales are increasing heavily

Immense respoonce for book on pm modi broken promises

narendra modi, narendra modi book, book on narendra modi, court on narendra modi book, Modi's promises, jayesh shah book, Fekuji is now in delhi, immense response, sales, gujarat court narendra modi, gujarat court narendra modi book, narendra modi book gujarat court

A court in Ahmedabad has dismissed a petition seeking a ban on the sale of a Gujarati book titled, ‘Fekuji Have Dilli Ma’ (Fekuji is now in Delhi) in which author Jayesh Shah, a Congress leader, has allegedly mocked Prime Minister Narendra Modi

ఆ పుస్తకం అమ్మాకాలు అదుర్స్.. మోదీనా.. మజాకా..

Posted: 07/01/2016 07:08 AM IST
Immense respoonce for book on pm modi broken promises

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు చెప్పగానే ఆదరణకు కొదవుండదు. ఆయనకు ఎంత ఆదరణ వుందో గత రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో బీజేపికి వచ్చిన మోజారిటీని చూస్తే అర్థమవుతుంది. అయితే మోడీకి వ్యతిరేకంగా ఓ పుస్తకం వస్తుంది అని తెలియగానే సరిగ్గా అలాంటి అధరణనే లభిస్తుంది. ప్రధాన మంత్రి మోడీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చ లేదని ఆయన హామీలను తూర్పారబడుతూ.. వ్యంగ్యాస్థాలతో కించిపరుస్తూ ఇటీవల మార్కెట్లో విడుదలైన పుస్తకం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయట.

'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ'  పేరుతో కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా రచించిన పుస్తకానికి అభిమానులు ఎక్కువైపోయారు. గుజరాత్  రాష్ట్రంలోనే కాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో కూడ పుస్తకం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా  మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతూ రాసిన పుస్తకం మార్కెట్లో ప్రాచుర్యం పొందిందట. పలు రాష్ట్రాల్లో ఆ పుస్తకానికి భారీ అమ్మకాలు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి.  

'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ'  అంటూ ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై జయేష్ షా ఈ పుస్తకాన్ని రాశారు.  అయితే పుస్తకంలోని రచనలు ప్రధానమంత్రిని కించపరిచేలా ఉన్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ అభిమాని, సామాజిక కార్యకర్త నర్సింహు సోలంకి అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు కొట్టేయడం తెలిసిందే.

తమ భావాలను తెలిపే హక్కు ప్రతివారికీ ఉంటుందని, పుస్తకంపై నిషేధం విధించడం సరికాదని, అలా చేస్తే వాక్ స్వాతంత్రంపై దాడి చేసినట్లే అవుతుందని న్యాయమూర్తి వివరణ కూడ ఇచ్చారు. అయితే మోదీపై వ్యంగ్యాస్థాలు సంధిస్తూ రాసిన ఆ పుస్తకం గురించి ముందు ఎవరికైనా తెలుసో లేదో గాని, కోర్టు సైతం అభ్యంతరాలను తోసి పుచ్చడంతో ఇప్పుడు ఆ పుస్తకానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోయిందట. నిజంగా ఆ పుస్తకంలో ఇంకా ఏం రాశారో చదవాలన్న ఉత్కంఠత ప్రజల్లో నెలకొని సెల్స్ అదిరిపోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi's promises  jayesh shah book  Fekuji is now in delhi  immense response  sales  

Other Articles