Plane catches fire while making emergency landing in Singapore

Singapore airlines plane catches fire in emergency landing

Singapore Airlines plane, Changi Airport, Boeing 777-300ER, Singapore airlines, Changi, fire, aircraft fire, Scary emergency landing, Singapore Airlines flight catches fire, Singapore Airlines flight to Milan catches fire

Singapore airlines Flight SQ368 caught fire after a technical glitch in its right wing on Monday morning

ITEMVIDEOS: సింగపూర్ ఎయిర్ లైన్స్ తప్పిన పెను ప్రమాదం..

Posted: 06/27/2016 08:51 AM IST
Singapore airlines plane catches fire in emergency landing

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అకస్మాత్తుగా మంటలంటున్నాయి. దీంతో విమానంలోని ప్రయాణికులందరూ మృత్యుభయం ఎలా వుంటుందో చవిచూశారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన అనుభూతిని చవిచూశామని ప్రయాణికులు తమ భయాందోళనను వ్యక్తం చేశారు. ఆ విమానంలో ప్రయాణించిన కోందరు ప్రయాణికులు ఇంకా టెన్షన్ లోనే వున్నారు.

సింగపూర్ నుంచి మిలాన్ వెళుతున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానంలో ఈ ఘటన సంభవించింది. మిలన్ బయలుదేరిన ఎస్క్యూ 368 విమానంలో ఇంధనం లీకవుతోందన్న సమాచారాన్ని చూసిన పైలట్లు దాన్ని అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించాలని కోరారు. చాంగీ ఎయిర్ పోర్టులో దిగీ దిగుతుండగానే, విమానం టైర్లు, ఇంజన్ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ ఉదయం 6:50 గంటల సమయంలో ఘటన జరుగగా, అప్పటికే సిద్ధంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు విస్తరించకుండా నిలువరించారు. ఆపై ఎమర్జెన్సీ డోర్లు తెరచి ప్రయాణికులను బయటకు రప్పించారు.

ఈ విమానంలో 222 మంది పాసింజర్లు, 19 మంది సిబ్బంది అందరూ క్షేమమేనని ఎస్ఐఏ వెల్లడించింది. విమానంలో మంటల వ్యాప్తిపై ఓ విండో సీటు నుంచి తీసిన 49 సెకన్ల వీడియోను ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇంజన్ లో ఇదే మంట గాల్లో ఉన్నప్పుడు వచ్చివుంటే, పెను ప్రమాదమే సంభవించేదని నిపుణులు వ్యాఖ్యానించారు. విమానం ఆగిన తరువాత కూడా ఐదు నిమిషాల పాటు తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నామని లీ అనే ప్రయాణికుడు చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singapore Airlines plane  Changi Airport  Boeing 777-300ER  Singapore airlines  Changi  fire  

Other Articles