జమ్ము సీఎం నోట దారుణమైన వ్యాఖ్యలు | Mehbooba Mufti ashamed of Islam comments

Mehbooba mufti ashamed of islam comments

Jammu CM Mehbooba Mufti, Mehbooba Mufti comments on Islam, Ashamed of bloodshed in name of Islam, Jammu CM Islama comments

Jammu CM Mehbooba Mufti comments on Islam. Ashamed of bloodshed in name of Islam during Ramzan.

జమ్ము సీఎం నోట దారుణమైన వ్యాఖ్యలు

Posted: 06/27/2016 09:28 AM IST
Mehbooba mufti ashamed of islam comments

జమ్ము కశ్మీర్ సీఎం మెహబూబా ముప్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదం రేపుతున్నాయి. కశ్మీర్ లోని పాంపోర్ లో శనివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో 8 మంది భారత సైనికులు సహా 25 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృత జవాన్లకు నివాళి అర్పించే సందర్భంగా ఆదివారం మొహబూబా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ముస్లింగా సిగ్గుపడుతున్నా’’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. పవిత్ర మాసం రంజాన్ నెలలో ముస్లింలుగా చెప్పుకుంటున్న ఉగ్రవాదుల చర్యను హేయమైనదిగా అభివర్ణించిన ఆమె తాను కూడా ముస్లింనన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు.

‘‘ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. పవిత్ర మాసంలో జరిగిన ఈ దాడితో ముస్లింగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. రంజాన్ మాసంలో అన్ని రకాల చెడు పనులకు దూరంగా ఉండాలని అల్లా చెప్పారు. ఈ తరహా ఘటనలు కశ్మీర్ ను అప్రతిష్ఠ పాలు చేసేవే’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అక్కడ ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు మతం పేరుతో ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆమె అంటున్నారు. రాజకీయాల కోసం మతాన్ని లాగి ఇంతలా దిగజారి మాట్లాడాలా అంటూ ప్రతిపక్ష నేషనల్ కాన్పరెన్స్ విమర్శలకు దిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  CM Mehbooba Mufti  Ashamed Islam  

Other Articles