పడుకున్న పులిని నిద్రలేపొద్దు: కేసీఆర్ | KCR warned that Dont awake sleeping Tiger

Kcr warned that dont awake sleeping tiger

Telangana, KCR, Ap, Water, Godavari, chandrababu, Harish Rao, ఏపి, తెలంగాణ, ప్రాజెక్టులు, గోదావరి

Telangana CM KCR gave strong warning to AP. He told that dont awake sleeping Tiger. He said ready to discuss about any thing.

పడుకున్న పులిని నిద్రలేపొద్దు: కేసీఆర్

Posted: 05/05/2016 08:43 AM IST
Kcr warned that dont awake sleeping tiger

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నీటి వివాదాల మీద తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ధోరణిపై ఏపి మండిపడుతోంది. కాగా దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా స్పందించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎంత వరకైనా తెగిస్తామని, చంద్రబాబు, జగన్ ఆటలు ఇక సాగవు అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్ట్‌ లపై ఏపీ నేతలు అనవసర ఆరోపణలు చేసి మర్యాద పోగొట్టుకోవద్దని హితవు పలికారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దంటూ.. పడుకున్న పులిని నిద్రలేపవద్దని హెచ్చరించారు.

గోదావరిలో రెండు రాష్ట్రాలకూ సరిపడా నీళ్లున్నాయన్న కేసీఆర్.. తెలంగాణపై ఎందుకు ఏడుస్తున్నారని ఆంధ్రానేతలను ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ నీతి నాకు తెలుసని, కడుపులో కత్తి.. నోట్లో బెల్లం పెట్టుకుని మాట్లాడతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీకి నిజంగా నీళ్లు కావాలనుకుంటే.. జగన్, చంద్రబాబు కుట్రలు మానుకోవాలన్నారు. ఆరునూరైనా సరే.. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ఉద్ఘాటించారు.ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల మీద చర్చించడానికి ఏపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ మంత్రి ఫోన్ చేశారు. త్వరలోనే భేటికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతలోనే పరిస్థితులు మారిపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు తప్పవా అనే అనుమానాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles