ఆమెది మర్డరా.. యాక్సిడెంటా? | Is it murder or accident

Telugu content

Devi, Accident, Jubilee hills, Hyderabad, Police, దేవి, హైదరాబాద్, యాక్సిడెంట్, మర్డర్

K Devi, 21, a B Tech III year student of G Narayanamma Institute of Technology and Science died and her friend, S Bharat Simha Reddy, 21, a B Com student from Ayyappa Society in Madhapur suffered injuries when the car they were travelling in crashed into a road side tree at Huda Enclave near Journalist's Colony in Jubilee Hills on Sunday.

ITEMVIDEOS: ఆమెది మర్డరా.. యాక్సిడెంటా?

Posted: 05/04/2016 12:56 PM IST
Telugu content

హైదరాబాద్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ మీద పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలే ఇది నిజంగా యాక్సిడెంటేనా లేదంటే మర్డరా అనే అనుమానాలతో పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో జరిగిన ఓ యాక్సిడెంట్ లో బిటెక్ ధర్డ్ ఇయర్ విద్యార్థిని దేవి అనే అమ్మాయి మృతి చెందింది. ఆ సమయంలో కారు నడుపుతున్న భరతసింహారెడ్డి బెలూన్‌ తెరచుకోవటంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు నిమిషాల్లో ఇల్లు చేరతానంటూ తండ్రికి ఫోన్‌ చేసిన ఆమెను కారులోనే హతమార్చి రోడ్డు ప్రమాదంగా డ్రామా ఆడుతున్నారని దేవి తరుఫు బంధువులు ఆరోపించారు. కారు ఢీకొన్నట్టుగా చెబుతున్న చెట్టు వద్ద గాజుపెంకులు చల్లి, చెట్టును చెక్కి ప్రమాదమనే భ్రమ కల్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదువుతన్న దేవి అనే అమ్మాయి వాల్ల నాన్న నిరంజన్ రెడ్డి. ఆయన బాగా సంపాదించిదన వ్యాపారి. దేవి సామ సుభాష్‌రెడ్డి కొడుకుభరతసింహారెడ్డితో కలిసి శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు. పార్టీ ముగిశాక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నలుగురూ జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని భరతసింహారెడ్డి ఇంటికి బయల్దేరారు. అక్కడకు దగ్గర్లోనే దేవి ఇల్లు కూడా ఉండటంతో డ్రాప్‌ చేసేందుకు బయల్దేరారు. కానీ అంతలోనే యాక్సిడెంట్ జరిగింది అని తెలిసింది. అయితే భరతసిహా రెడ్డి వైపు ఉన్న సేఫ్టీ బెలూన్లు మాత్రమే ఓపెన్ కావడం, కావాలనే చెట్టును నరికినట్లు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు అనుమానంతో విచారిస్తున్నారు.  యాక్సిడెంట్ జరిగిన టైంలో కారులో ఎంతమంది ఉన్నారు... మద్యం మత్తులో కారు నడపటంవల్లనే ప్రమాదం జరిగిందా! ఇలా ఎన్నో అనుమానాలు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles