Shocking: Woman foils rape and abduction bid after raising alarm

Woman foils abduction attempt in bengaluru

woman kidnapped, woman dragged, woman grabbed, cctv, cctv video, woman caught, bengaluru, kidnapped, crime against women

In a shocking incident, a woman was dragged and kidnapped in public view in Bengaluru. The act was caught on CCTV camera installed in the area.

ITEMVIDEOS: రోడ్డుపై నిల్చున్న యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం

Posted: 05/02/2016 06:59 PM IST
Woman foils abduction attempt in bengaluru

బెంగళూరు మహానగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రోడ్డుపై నిల్చుని సెల్ ఫోన్ మాట్లాడుతున్న యువతిని అకస్మికంగా వచ్చిన అగంతకుడు వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఎత్తుకెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటల 50 నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. బెంగుళూరులోని యువతులు భయాందోళనకు గురవుతున్నారు. తాను రక్ష్ంచమంటూ ఎంత బిగ్గరగా  అరిచినా.. ఎవరు వినిపించుకోలేదని బాధితురాలు తెలిపింది,

తన పేయింగ్ గెస్ట్‌హౌస్‌ ఎదురుగా 25 ఏళ్ల యువతి ఫోన్‌లో మాట్లాడుతుండగా ఆమెను ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు తీసుకెళ్లి ఆమెపై బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. దక్షిణ బెంగళూరులోని కట్రిగుప్పెలో ఏప్రిల్ 23న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై నిదానంగా పోలీసులు, కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని బాధితురాలు బలంగా ప్రతిఘటించింది. అతని చేతిని గట్టిగా కొరికి.. అతని బారి నుంచి తప్పించుకుంది. అనంతరం తన పెయింగ్‌ గెస్ట్‌ గదికి వచ్చి తనపై జరిగిన అకృత్యాన్ని వివరించింది. బాధితురాలు కల్యాణ్ నగర్‌లోని బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది. గత నెల 23న రాత్రి ఆమె స్నేహితుడు తన పెయింగ్ గెస్ట్ రూమ్‌ సమీపంలోని మారెమ్మ ఆలయం వద్ద బాధితురాలిని దిగబెట్టాడు. ఆ తర్వాత ఫోన్‌ రావడంతో అక్కడే తచ్చాడుతూ ఆమె ఫోన్‌లో మాట్లాడింది.

ఇదే అదనుగా భావించిన దుండగుడు వెనుక వైపునుంచి ఆమెను చుట్టేసుకొని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న పాదచారులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దుండగుడి నుంచి తప్పించుకున్న ఆమె అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేయకుండా పెయింగ్ గెస్ట్ రూమ్ యాజమాని తనను ఒత్తిడి చేశాడని, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు చెప్తున్నది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles