Adam Voges back with Middlesex after concussion tests in hospital

Voges concussed in freak fielding mishap

adam voges, voges injury, adam voges australia, voges middlesex captain, middlesex vs hampshire, sports news, sports, cricket news, cricket

Adam Voges was hit in the back of the head by a ball thrown to the stumps by a substitute fielder and missed by wicketkeeper John Simpson

మైదానంలో కుప్పకూలిన మరో క్రికెటర్

Posted: 05/02/2016 08:14 PM IST
Voges concussed in freak fielding mishap

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోమారు భయాందోళనకు గురైంది. తమ స్టార్ బ్యాట్స్ మెన్ ఫిలిప్ హ్యూస్ తరహాలోనే మరో క్రీడాకారుడు కూడా తలకు బలమైన గాయమై మైదానంలో కుప్పకూలిపోవడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఇటీవలే శ్రీలంక టెస్టు బ్యాట్స్ మెన్  కౌశల్ సిల్వ కూడా ఇలానే కుప్పకూలిన ఘటనను క్రీకట్ ప్రపంచం, అభిమానులు మర్చిపోకముందే మరోమారు తమ జట్టుకు చెందిన టెస్టు బ్యాట్స్మెన్ ఆడమ్ వోజస్ తలకు బంతి తగలడంతో అందోళనకు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా క్రికెటర్ అడమ్ వోజస్ తలకు బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్లోని చాంపియన్షిప్ గేమ్ లో భాగంగా మిడిల్ సెక్స్ కు నేతృత్వం వహిస్తున్న వోజస్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్ కీపర్ జాన్ సింప్సన్ వదిలేయడంతో  అది కాస్తా అక్కడే ఉన్న వోజస్ తలకు బలంగా తగిలింది. దీంతో వోజస్   గ్రౌండ్ లో కూలబడిపోయాడు.  అతనికి ప్రాథమిక చికిత్స అందించిన గ్రౌండ్ వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
అతని తలకు స్కాన్ చేసిన అనంతరం ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. వోజస్ గాయం పట్ల మిడిల్ సెక్స్ డైరెక్టర్ ఆంగూస్ ఫ్రాజర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వోజస్ కు ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం వోజస్ కోలుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్నిరోజుల క్రితం శ్రీలంక ఆటగాడు కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adam voges  australia  injury  middlesex captain  

Other Articles