Sunanda Pushkar died of poisoning

Sunanda pushkar died of poisoning

Sunanda Pushkar, Sunanda Pushkar Death, Sunanda Pushkar Death cause of poison, Shashi Tharoor

Sunanda Pushkar died of “poisoning” with the AIIMS medical board, which gave its opinion on the FBI report on her viscera samples, unanimously concluding that there was presence of anxiety drug Alprax in her stomach. However, the board did not rule out the possibility of any injectable poison, in view of a particular mark on Sunanda’s body, and said that the FBI report confirmed the presence of lidocaine in her body, said the medical board’s opinion communicated to Delhi Police.

సునంద పుష్కర్ మృతికి కారణం విషం

Posted: 01/23/2016 11:00 AM IST
Sunanda pushkar died of poisoning

మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ మృతి మీద ఎయిమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. అందులో ఆమె విషం వల్ల చనిపోయినట్లు ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంలో మోతాదుకు మించిన ‘అల్ప్రాక్స్’ అనే మత్తు పదార్థం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎఫ్‌బీఐ మాత్రం ఆమె శరీరంలో ‘లిడోసియినే’ అనే రసాయన పదార్థం ఉన్నట్లు పేర్కొందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద శరీరంపై సూది మార్కు ఉందని, కాబట్టి ‘ఇంజక్షన్’ కోణంలోనూ సిట్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్‌.బీ.ఐ అభిప్రాయపడింది.  

అలాగే ఆమె శరీరంలో ఖాలీగా ఉన్న 27 అల్ప్రాక్స్ టాబ్లెట్లు ఉన్నాయని, క్లోమం, కిడ్నీల్లో, రక్తంలో ఈ మత్తు పదార్థం తాలుకూ పదార్థాలు ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఆమె శరీరంపై పంటి గాట్లతో సహ పలు చోట్ల గాయాలున్నట్లు ఎఫ్‌బీఐ నివేదించింది. సునంద పుష్కర్ ఓ స్టార్ హోటల్ మృతి చెందిన విషయం తెలిసిందే కాగా సునంద పుష్కర్ మృతి మీద శశిధరూర్ మీద కూడా పలు విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఎయిమ్స్ వెల్లడించిన రిపోర్ట్ తో సునంద మరణం కేవలం విషం వల్లే జరిగిందని.. అది కూడా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఉండవచ్చు అని అనుమానాలు కలుగుతున్నాయి. కాగా దీల్లీ పోలీసులు ఎయిమ్స్ రిపోర్ట్ ను కోర్టులో సబ్ మిట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles