four school students raped a girl and shoot video

Four school students raped a girl and shoot video

Rape, School girl, School boys, Rape on school girl, Mumbai, Crime News, Crime in Mumbai

15-year-old was gangraped by her boyfriend and his friends on pretext of group study. After Rape, they share the video with friends.

స్కూల్ పిల్లలు కలిసి చేశారు రేప్.. పైగా వీడియో తీశారు

Posted: 11/27/2015 11:24 AM IST
Four school students raped a girl and shoot video

స్కూల్ పిల్లలు అనగానే చాలా అమాయకత్వం.. అన్నింటికి మించి పరిణతి లేకపోవడం చూస్తుంటాం. కానీ ఈ వార్త చదివిన తర్వాత మాత్రం స్కూల్ పిల్లలు అంటే భయపడతారు. ఎందుకంటే ఓ స్కూల్ లో చదువుతన్న నలుగురు పిల్లలు కలిసి ఓ అమ్మాయిని రేప్ చేశారు. పైగా ఆ మొత్తం వ్యవహారాన్ని కెమెరాలతో వీడియో తీశారు. ఒకవేళ ఆ అమ్మాయి రేప్ విషయాన్ని బయటకు చెబితే వీడియో నెట్ లో పెడతామని బెదిరించారు. ముంబైలో చోటుచేసుకున్న ఆ ఘటన  అందరికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. కాగా ఆ నలుగురు పిల్లలను అరెస్టు చేసి.. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

Also Read: తొమ్మిదేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుల అఘాయిత్యం..

ముంబై మహా నగరంలోని ఓ స్కూల్ లో చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని మీద కన్నేశారు. అయితే అందులో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఇంటి దగ్గర లే్కపోవడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. తర్వాత తమ స్కూల్ లోని ఓ అమ్మాయికి ఫోన్ చేసి.. సబ్జెక్ట్ లో ఏవో డౌట్స్ ఉన్నాయని పోన్ చేసి పిలిపించారు. ఆ అమ్మాయి అక్కడికి చేరుకోగానే రేప్ చేశారు. అలా రేప్ చేస్తున్నప్పుడు వీడియో కూడా తీశారు. ఒకవేళ ఆ అమ్మాయి అరిచినా.. బయటకు వెళ్లి ఏమైనా చెప్పినా వెంటనే నెట్ లో వీడియో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. అయితే ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. అయితే అలా చివరకు అమ్మాయి వాళ్ల బంధువు దగ్గరికి వీడియో చేరింది. దాన్ని చూసిన ఆమె ఆ అమ్మాయికి వీడియో చూపించి నిజం ఏంటని అడిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  School girl  School boys  Rape on school girl  Mumbai  Crime News  Crime in Mumbai  

Other Articles