delhi police arrested the Driver who fled with twenty two crore rupees

Delhi police arrested the driver who fled with twenty two crore rupees

driver, Delhi, ATM, Cash Van, Robbery, Rs. 22.5 crore, ATM heist, Govindpuri

Delhi Police arrested a Driver, who escape with twenty two crore fifty lakh bank amount. The driver of a cash transit van allegedly fled with around Rs. 22.5 crore from southeast Delhi's Govindpuri area today when the accompanying armed security guard stepped down near Govindpuri Metro station so that he could relieve himself.

22.5 కోట్లతో ఉడాయించిన డ్రైవర్ అరెస్ట్

Posted: 11/27/2015 11:07 AM IST
Delhi police arrested the driver who fled with twenty two crore rupees

ఆశ అనర్థానికి దారి తీస్తుంది. ఏటిఎంలలో డబ్బులు కొట్టేయడం.. లేదా ఏటిఎంల దగ్గర డబ్బులు డ్రా చేస్తున్న వారి నుండి డబ్బులు కొట్టేయడం గురించి చాలా సార్లు విన్నాం. తాజాగా ఓ డ్రైవర్ ఏకంగా ఏటిఎంలో పెట్టాల్సిన ఇరవై రెండున్నర కోట్లతో ఉడాయించడం సంచలనం రేపింది. దేశ రాజధాని హస్తినలో భద్రతా సిబ్బంది దృష్టి మరల్చి 22.5 కోట్లతో ఉడాయించిన డ్రైవర్ ప్రదీప్ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. గార్డు లఘుశంక తీర్చుకొనేందుకు వాహనం దిగిన సమయంలో తాను ముందు వీధిలో ఎదురుచూస్తుంటానని చెప్పిన డ్రైవర్ అటునుంచి అటే పరారయ్యాడు.

గార్డు తిరిగొచ్చేసమయానికి వాహనం, డ్రైవర్ కనిపించకపోవడంతో సంబంధిత ప్రైవేటు బ్యాంక్‌కు సమాచారం అందించాడు. ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ప్రదీప్ శుక్లాను ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014 జనవరిలో ఇటువంటి దోపిడీ ఢిల్లీలో జరిగింది. ఒక వ్యాపారిని తుపాకీతో బెదిరించి దుండగులు 7.69 కోట్లు ఎత్తుకుపోయారు. తాజాగా జరిగిన ఘటనతో పోలీసులు, సెక్యురిటీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యారు. బయటి వారైనా , సొంత వారైనా దొంగతనం చేసే అవకాశాలు ఉంటడంతో అలర్ట్ గా ఉండాలని ఏజెన్సీలు భద్రతా సిబ్బందిని హెచ్చరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : driver  Delhi  ATM  Cash Van  Robbery  Rs. 22.5 crore  ATM heist  Govindpuri  

Other Articles