4-year-old boy 'pregnant' with Dead foetus

Dead foetus found inside 4 year old boy

rare medical phenomenon, pregnant boy, dead foetus, 4, year old boy, West Midnapore, west bengal, Dr Sirshendu Giri, foetus in foetu (baby within a baby), pregnancy

In a rare medical phenomenon, a dead foetus has been found inside the abdomen of a four-year-old boy in West Midnapore district.

విచిత్రమా..? విధి వైపరిత్యామా..? గర్భం దాల్చిన నాలుగేళ్ల బాలుడు..

Posted: 10/07/2015 07:05 PM IST
Dead foetus found inside 4 year old boy

పశ్చిమ బెంగాల్ లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అది విచిత్రమా, లేక విధి వైపరిత్యామా లేక సృష్టికే అర్థంకాని శేష ప్రశ్నగా మిగిలింది. రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల  బాలుడి గర్భం దాల్చాడు. అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు బాలుడి కడుపులోంచి కాళ్లు, చేతులు, గోళ్లు, పూర్తిగా రూపుదిద్దుకోని తల భాగంతో ఉన్న మృత పిండాన్ని వైద్యులు వెలికి తీశారు. నాలుగేళ్ల చిన్నారి బాలికలే గర్భం దాల్చడం విచిత్రంగా పరిగణించే సమయంలో నాలుగేళ్ల బాలుడు కడుపులో ఇలా.. మృత పిండాన్ని తొలగించడం.. విధి వైపరిత్యకం కాక మరేంటారు.

వివరాల్లోకి వెళితే  బిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్కిబంద్ గ్రామంలో నివసించే నాలుగేళ్ల బాలుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో అతని  తల్లిదండ్రులు వైద్యులను  సంప్రదించారు. అయితే ప్రాథమికంగా  ఆ బాలుడిని పరిశీలించిన వైద్యులు అతడి కడుపులో  ఏదో ట్యూమర్ ఉండొచ్చని అనుమానించారు. నిర్ధారణ కోసం స్కాన్, సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆ బాలుడి పొట్టలో మృతపిండం ఉన్నట్టుగా  నిర్ధారణ  అయిందని డా. శ్రీషేందు గిని తెలిపారు.  

దీంతో అతడికి శస్త్రచికిత్స  చేసి కాళ్లు, చేతులు గోళ్లు, పాక్షికంగా రూపుదిద్దుకున్న తల  భాగాలతో కూడిన  మృత పిండాన్ని  తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. వైద్యశాస్త్రం  పరిభాషలో దీన్ని పిండంలో పిండం  అని పిలుస్తామని  డా. గిని తెలిపారు. సుమారు అయిదు నుండి ఆరు లక్షల మందిలో ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని పేర్కొన్నారు.  గర్భంతో ఉన్నపుడు  పిండదశలో జరిగే కొన్ని అవాంఛనీయ మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నారు.  ముఖ్యంగా  గర్భంలో కవల పిండాలు రూపుదిద్దుకునే క్రమంలో ఒక పిండంలోకి మరో పిండం చొరబడటం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dead foetus  4 year boy  Dr Sirshendu Giri  

Other Articles