5-year-old allegedly raped by government employee on two consecutive days

5 year old allegedly raped by government employee

5-year-old allegedly raped by government employee on two consecutive days, Seppa, East Kameng district of Arunachal Pradesh, Logo Singhi, Agriculture department, Women Welfare Organisation of East Kameng, The East Kameng Social Welfare and Cultural Organisation, 5-year-old, rape, government employee, itanagar, arunachal pradesh, crime on children, violence against girl child, molestation on girls, rape on girls, harrasement on girl child

A minor was allegedly raped for two consecutive days by a government employee at Seppa in East Kameng district of Arunachal Pradesh

ఐదేళ్ల చిన్నారిపై ప్రభుత్వ ఉధోగి అఘాయిత్యం.. రెండు రోజులపాటు వరుసగా అత్యాచారం..

Posted: 10/07/2015 09:34 PM IST
5 year old allegedly raped by government employee

అరుణాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తండ్రి లాంటి వాడు తన పాలిట పైశాచికంగా అత్యాచారానికి యత్నిస్తాడని తెలియదు ఆ చిన్నారికి. ఇరుగు పోరుగు వారు కావడంతో చనువుతో వచ్చిన చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి రెండు రోజుల పాటు అతి దారుణంగా, అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ కసాయి. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని సెప్పా ప్రాంతంలో నివసిస్తున్న ప్రభుత్వ వ్యవహాసయ శాఖ ఉద్యోగి లోగో సింఘి.. కామంతో కళ్లు మూసుకుపోయి ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తమ పోరుగున నివసించే ఓ చిన్నారిపై కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అక్టోబర్ 2, 3 రోజుల్లో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుసుకున్న సదరు ప్రభుత్వోద్యోగి బాలికను తన నివాసంలోకి పిలుచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై అత్యాచార యత్నం, సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తూర్పు కమెండ్ మహిళా శిశు సంక్షేమ సంఘం కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ర్యాలీని కూడా నిర్వహించింది.

కాగా తూర్పు కమెండ్ సాంఘిక సంక్షేమ మరియు సంస్కృతిక శాఖ ఈ ఘటనను అత్యంత క్రూరమైనదిగా పేర్కోంది. అమానవీయ చర్యగా అభివర్ణించింది. మహిళలు, చిన్నారుల పట్ల ఇంతటి తీవ్ర వ్యతిరేకమైన భావన వుండటం సహేతుకం కాదంది. తన మనవరాలి వయస్సున్న బాలికను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చెరచడం సభ్య సమాజం తలదించుకునే చర్యని పేర్కోంది. బాలిక మనోవేదనను అర్థం చేసుకోకుండా వరుసగా రెండు రోజుల పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన నీచుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఇలాంటి దారుణ ఘటనలను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని కోరింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 5-year-old  rape  government employee  itanagar  arunachal pradesh  

Other Articles