Chain-snatching in KBR Park, thief caught

Women attacked by chain snatcher near kbr park in broad day light

women attacked by chain snatcher, chain snatcher near KBR Park, chain snatcher in Banjara Hills, chain snatcher attacked women, chain snatcher left women injured, woman resisted chain snatcher, women raised alarm, onlookers thrashed chain snatcher, Kalaapi Santosh, Naveena, the victim, Chain-snatching, kBR Park, hyderabad, banjara hills

A women was attacked by a chain snatcher in broad daylight near KBR Park, Banjara Hills.

కేబీఆర్ పార్కు వద్ద మహిళను కత్తితో బెదిరించిన చైన్ స్నాచర్

Posted: 09/16/2015 05:13 PM IST
Women attacked by chain snatcher near kbr park in broad day light

రాజధాని నగరం హైదరాబాద్లో దోపిడీ దొంగలు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు తాళాలు వున్న ఇళ్లకు కన్నాలు వేస్తూ.. దొంగులు విరుచుకుపడుతుంలే.. మరోవైపు చైన్ స్నాచర్లు కూడా ఒంటరి మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. మహిళాల ప్రాణాలపైకి తీసుకువస్తూ.. వారి మొడలోని మంగళసూత్రాలు, ఇతర బంగారు అభరణాలను తెంచుకుని పోతున్నారు. తాజాగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళపై ఓ దుండగుడు చైన్ స్నాచింగ్కు యత్నించాడు. అయితే ఆ మహిళ... అతడిని ధైర్యంగా ఎదుర్కొంది.  ఈ సందర్భంగా ఆమెపై దుండగుడు దాడి చేసి, గాయపరిచాడు. మహిళ వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు ఫోన్ లాక్కున్నాడు. ఈ సందర్భంగా అతడితో మహిళ పెనుగులాడింది. అంతేకాదు గట్టిగా కేకలు వేసింది. అమె అరుపులు విన్న పలువురు స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దుండగుడు పాతనేరస్థుడని,  అతడి పేరు కలాపి సంతోష్గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే చైన్ స్నాచింగ్ లు, బైక్ దొంగతనాలకు సంబంధించిన ఆరు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. గతంలో వీడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, గత నెల 31న జైలు నుంచి విడుదల అయ్యాడని పోలీసులు వెల్లడించారు. జైలుకు వెళ్లివచ్చిన బుద్ది మారని సంతోష్ మళ్లీ దొంగతనం కోసం కేబీఆర్ పార్క్ వద్ద కాపు కాసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత మహిళ నవీన మాట్లాడుతూ ...వాకింగ్ చేస్తున్న సమయంలో తనను దొంగ కత్తితో బెదిరించాడని, నీ చైన్ ఇస్తావా?...చచ్చిపోతావా? అని బెదిరించాడని తెలిపింది. తన వద్ద ఉన్న బంగారు గొలుసు, ఫోన్ ఇచ్చేయమన్నాడని, అందుకు తాను నిరాకరించటంతో దాడి చేశాడని, తనను కింద పడేశాడని ఆమె పేర్కొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain-snatching  kBR Park  hyderabad  banjara hills  

Other Articles