Mahabubnagar Bandh | Guvvala Balraj | Rammohan Reddy

Congress call for bandh in mahabubnagar

Mahabubnagar, Bandh, Guvvala Balraj, Rammohan Reddy, DK Aruna

Congress call for bandh in Mahabubnagar. TRS MLA Guvvala balaraju slaps Congress MLA Rammohan Reddy in Mahabubnagar ZPMeeting.

నేడు మహబూబ్ నగర్ జిల్లా బంద్

Posted: 09/05/2015 08:20 AM IST
Congress call for bandh in mahabubnagar

మహబూబ్ నగర్ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేల ఫైటింగ్ సంఘటనకు నిరసనగా .. నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.  రసాభాసగా నడిచిన మహబూబ్నగర్ జెడ్పీ సమావేశం.. చివరికి ఎమ్మెల్యే ఫైటింగ్కు దారితీసింది. ఈ వివాదంలో... టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. కాంగ్రెస్కు చెందిన మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయి చేసుకున్నారు. పోడియం వద్ద మాట్లాడుతూ మాట్లాడుతూనే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. బాలరాజు చర్యను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. నేడు అత్యవసర సీఎల్పీ సమావేశం నిర్వహించి.. ఆపై గవర్నర్ ను  కలిసి దీని మీద ఫిర్యాదు చేస్తామన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై చేయి చేసుకోవాడానికి.. అతడు చేసిన కవ్వింపు చర్యలే కారణమని వివరణ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తమ ప్రసంగానికి పదేపదే అంతరాయాలు కలిగించడంతో పాటు.. చెప్పడానికి కూడా వీలు కాని పదాలతో దూషించడంతోనే.. అందుకే కాస్త అదుపు తప్పాల్సి వచ్చిందని బాలరాజు అన్నారు.టీఆర్ఎస్ ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తోందంటూ కాంగ్రెస్ పలుమార్లు టీఆర్ఎస్పై విమర్శలు చేసింది. రామ్మోహన్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారని, అదికాస్తా మాటామాట పెరుగుతూ.. వేదిక దాకా చేరింది. అక్కడ పరిస్థితి అదుపుతప్పడంతో సహనం కోల్పోయి చేయిచేసుకోవాల్సి వచ్చిందని గువ్వల బాలరాజు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahabubnagar  Bandh  Guvvala Balraj  Rammohan Reddy  DK Aruna  

Other Articles