Teachers Day | Dr Sarvepalli Radhakrishnan | Sep 5

Need to take a leaf from the life and wisdom of dr sarvepalli radhakrishnan as a teacher

Teachers Day, Dr Sarvepalli Radhakrishnan, Sep 5, India, Teacher, Student

Need to take a leaf from the life and wisdom of Dr Sarvepalli Radhakrishnan as a teacher In India, Teacher's Day is celebrated on September 5 to commemorate the birth anniversary of Dr Sarvepalli Radhakrishnan (1888 - 1975) who was a teacher par excellence along with being an outstanding philosopher and statesman.

నేడే గురుపూజోత్సవం.. అందరికి ఆచరణీయం

Posted: 09/05/2015 08:02 AM IST
Need to take a leaf from the life and wisdom of dr sarvepalli radhakrishnan as a teacher

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ! తల్లిదండ్రుల సరసన కూర్చుండే అర్హత ఒక్క గురువుకే ఉంది! అడుగులు తడబడుతుంటే.. ఆ తప్పటడుగులను సరిచేసి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది గురువు! గురుపూజోత్సవం! టీచర్స్ డే!

గురుబ్రహ్మ|

గురు: విష్ణు:|

గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవేనమః||

గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను. గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట. శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు.


ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు. భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఒక "వేడుక" రోజు భావిస్తారు.

ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అని అనేవారు సర్వేపల్లి. ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు. అలాంటి సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది గురువులకు వందనాలు...

నిదురించే  ఆత్మలను మేలుకోలిపెవాడు,సోమరిపోతును చురుగ్గా తయారు చేసేవాడు,
తెలుసుకోవాలన్న ఆతురత గల వ్యక్తులను ప్రోత్సహించేవాడు,
చంచల మనస్తత్వం గల వ్యక్తిని అంచెలంచలు గా మార్చేవాడు అధ్యాపకుడు.
తెలుసుకోవడం లో ఉన్న ఆనందాన్ని నలుగురికి తెలియజేసేవాడు,
తన విధ్యార్ధులతో తన విద్యా ధనాన్ని పంచుకునేవాడు,భావి జీవితం లో ఉత్సాహపు వెలుగును పంచే వెలుగు దీపాలను వెలిగించేవాడే అధ్యాపకుడు అవుతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teachers Day  Dr Sarvepalli Radhakrishnan  Sep 5  India  Teacher  Student  

Other Articles