YS Jagan Mohan Reddy Reveals Why He Campaigning For Special Status | Chandrababu Naidu News | BJP Party Updates

Ys jagan mohan reddy reveals special status details chandrababu naidu bjp party

ys jagan mohan reddy, chandrababu naidu, ys jagan campaign, special status campaign, andhra pradesh state issues, ap state issues, ap capital city, amaravathi, special status secrets

YS Jagan Mohan Reddy Reveals Special Status Details Chandrababu Naidu BJP Party : YS Jagan Mohan Reddy Reveals Why He Campaigning For Special Status In His Latest Press Meet.

‘ప్రత్యేక హోదా’ వెనుక అసలు సీక్రెట్ చెప్పిన జగన్

Posted: 09/01/2015 07:02 PM IST
Ys jagan mohan reddy reveals special status details chandrababu naidu bjp party

గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చిన బీజేపీ.. అధికారం చేజిక్కిన తర్వాత దాని ఊసే ఎత్తలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నిస్తే.. అసలు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పేసింది. అంతే! ఇక అప్పటినుంచి ప్రత్యేకహోదా అంశమై ఆంధ్రరాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. మరోవైపు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామంటున్నప్పటికీ.. ‘ప్రత్యేక హోదా’నే కావాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఇక రాష్ట్ర అధికార టీడీపీ పార్టీ కూడా నిన్నటివరకు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం కొనసాగించింది కానీ.. మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు మంతనాలు జరిపిన అనంతరం ఆయన ఇచ్చిన హామీల మేరకు ప్రత్యేక ప్యాకేజీలకు పచ్చజెండా ఊపేశారు.

కానీ.. వైఎస్సార్సీపీ మాత్రం ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ మేలైనది అని టీడీపీ నేతలు వాదిస్తుండగా.. ప్రత్యేకహోదా వేరు, ప్యాకేజీ వేరు అంటూ జగన్ వాదిస్తున్నారు. తాను స్పెషల్ స్టేటస్ కోసమే ఎందుకు పోరాటం కొనసాగిస్తున్నానోనన్న విషయాన్ని విశదీకరించారాయన. ‘ప్రత్యేక హోదా’ లభిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటులు వస్తాయని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఆదాయ, కస్టమ్స్ సుంకాల నుంచి వంద శాతం మినహాయింపూ ఉంది. ఈ లాభాలను 11 రాష్ట్రాలు పొందుతున్నాయని, ఏపీలో ఇలాంటి రాయితీని ఎందుకు వద్దంటున్నారో తెలియడం లేదని జగన్ పేర్కొన్నారు. ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుందని, అదే హోదా లేకుంటే 70 శాతం వస్తుందని జగన్ తెలిపారు. 20 శాతం నిధులు ఎందుకు ప్రభుత్వం వద్దనుకుంటోందో అర్థం కావడం లేదని జగన్ పేర్కొన్నారు.

ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రానికి ఎంత శాతం నిధులు ఇవ్వాలనే దానికి నిబంధనలు లేవని తెలిపిన జనగ్... ప్రధానికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వవచ్చని అన్నారు. జమ్మూకాశ్మీర్ కు 70 వేల కోట్ల రూపాయలు అలా కేటాయించినవేనని జగన్ వివరించారు. కోటీ యాభై లక్షల మంది జనాభా కలిగిన జమ్మూ కాశ్మీర్ కు అంత మొత్తం కేటాయిస్తే, 5 కోట్ల జనాభా కలిగిన ఏపీకి ఎంత నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వల్ల వచ్చే సౌకర్యాల వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి పోటెత్తుతాయని, వేల కోట్ల పెట్టుబడులతో ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. అందుకే.. ప్రత్యేక హోదా కోసం తాను పోరాటం కొనసాగిస్తున్నట్లుగా జగన్ స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  chandrababu naidu  ap special status campaigns  

Other Articles