Another Btech Student Sainath Suicide Cause Of Ragging | Ragging Murders | Warangal Kazipet Station

Btech student sainath suicide ragging warangal kazipet railway station

btech student sainath suicide, ragging murders, college raggings, ragging incidents, student sainath suicide, students suicide

BTech Student Sainath Suicide Ragging Warangal Kazipet Railway Station : Another Btech Student Sainath Suicide Cause Of Ragging In College.

ర్యాగింగ్ భూతానికి బలైన మరో విద్యార్థి

Posted: 09/01/2015 06:40 PM IST
Btech student sainath suicide ragging warangal kazipet railway station

తమ భవిష్యత్తును అందంగా మలుచుకోవడం కోసం కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ‘ర్యాగింగ్’ భూతంలా వెంటాడుతోంది. దీనిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఏమాత్రం ఫలితం లేకుండా పోతోంది. అందుకే.. ఈ ర్యాగింగ్ భూతానికి తాళలేక రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇంకా మరువకే ముందే మరో విద్యార్థి అదే ర్యాగింగ్ కు బలయ్యాడు.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ అనే విద్యార్థి మేడ్చల్ లోని సీఎం కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. మొదటి నుంచే అతనిపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. తనను వదిలేయాల్సిందిగా అతగాడు చాలాసార్లు వేడుకున్నాడు కూడా! కానీ.. సీనియర్లు తమ పైశాచికానందం పొందడం కోసం అతనిని నిత్యం వేధిస్తూ వచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ విద్యార్థి.. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు.. మృతదేహం వద్ద దొరికిన పర్సులో సూసైడ్ నోట్ ను గుర్తించారు. ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా అందులో పేర్కొన్నాడు.

‘ఆరోజు సీనియర్లు అలా చేయకపోయి వుంటే.. ఈరోజు తానిలా ఆత్మహత్యకు గురయ్యేవాడిని కాద’ని సాయినాథ్ ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ‘ప్లీజ్.. స్టాప్ ర్యాగింగ్’ అంటూ అందులో అభ్యర్థించాడు కూడా. దీనిని బట్టి చూస్తుంటే.. సీనియర్లు ఇతనిని ఎంత దారుణంగా హింసించివుంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student sainath suicide  ragging controversies  rishiteshwari case  

Other Articles